Home> సోషల్
Advertisement

Dangerous Driving: చిన్నపిల్లడిలా ఆవుని బైక్‌పై ఎక్కించుకొని తీసుకెళ్లిన కుర్రాడు..వీడియో చూస్తే పొట్ట పట్టుకుని నవ్వుకుంటారు!


Dangerous Driving: సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తన బైకుపై ఆవును తీసుకెళుతున్న వీడియో తెగ వైరల్ గా మారింది. వీడియోను చూసిన నేటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా ఈ వీడియో నవ్వు పుట్టించే విధంగా కూడా ఉంది.

Dangerous Driving: చిన్నపిల్లడిలా ఆవుని బైక్‌పై ఎక్కించుకొని తీసుకెళ్లిన కుర్రాడు..వీడియో చూస్తే పొట్ట పట్టుకుని నవ్వుకుంటారు!

 
Dangerous Driving: సోషల్ మీడియా వినియోగం ఒక్కసారిగా పెరిగిపోవడంతో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఏ సమాచారన్నైనా సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. సోషల్ మీడియాలో నిత్యం లక్షలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో ఎక్కువగా కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అయితే, మరికొన్ని మాత్రం నెటిజన్ల పొట్టు ఉబ్బేదాకా నవ్వించే వీడియోలు మరికొన్ని.. చాలామంది ఇప్పుడు మైండ్ ను రిలాక్స్ గా చేసుకోవడానికి సోషల్ మీడియాలో తరచుగా ఫన్నీ వీడియోలను చూస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోని ఈరోజు ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ఆ వీడియో ఏంటో? ఆ వీడియోకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రోడ్డు ప్రమాదాలు జరగకుండా అన్ని ప్రభుత్వాలు రోడ్డు భద్రత నియమాలను తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఓ వ్యక్తి డ్రైవింగ్ పరిమితులను దాటుతూ రోడ్డు పైకి వచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి డ్రైవింగ్ పరిమితిని మించి తన బైక్ పై ఆవుని చిన్నపిల్లల కూర్చుండబెట్టుకొని బైకును డ్రైవింగ్ చేయడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఆ వ్యక్తి స్పీడ్ లిమిట్ ని దాటుతూ వేగంగా వెళ్లడం కూడా మీరు గమనించవచ్చు. మోటార్ సైకిల్ పై ఆవును తీసుకెళ్లడం చూసి రోడ్డుపైన వెళుతున్న ప్రయాణికులు తెగ ఆశ్చర్యపోయారు. అంత చిన్న బైక్ పై టన్నుల బరువు ఉండే ఆవును తీసుకపోవడం గ్రేట్ అని మరికొందరంటున్నారు.

 
 
 
 
 

ఈ వీడియోని చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చూడడానికి ఈ వీడియో నవ్వు పుట్టించే విధంగా ఉండడంతో వీడియోను చూస్తూ పగలబడి నవ్వుతున్నారు. మరికొందరు నెటిజన్లైతే బైక్ పై కుక్కనో పిల్లినో ఎక్కించుకొని తిరగడం చూసి ఉంటాం కానీ ఇలా ఆవును తీసుకెళ్లడం ఇదే మొదటిసారి చూస్తున్నామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా తీసుకెళ్లడం చాలా గ్రేట్ అని అంటున్నారు. మరికొందరైతే ఈ వీడియోని చూసి తెగ షాక్ అవుతున్నారు. ఒకవేళ ఆ ఆవు ఏమాత్రం అటు ఇటు అయినా మనిషి ప్రాణాలు పోయేవని వారంటున్నారు. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

ఈ వీడియోను ఓ వ్యక్తి తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వ్యక్తి బైక్ పై ఎక్కించుకొని ఆవును తీసుకెళుతున్న ఈ వీడియోను ఇప్పటికీ లక్షల మంది వీక్షించారు. అంతేకాకుండా వేల మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోకు లైక్ కొట్టారు. ఏది ఏమైనా ఇలాంటి సాహసాలు చేసేవారికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అయితే ఈ వీడియోను ఏ ప్రాంతంలో తీశారు అని సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Read More