Home> సోషల్
Advertisement

Crocodile Video: మనిషిని పూర్తిగా మింగేసిన మొసలి.. బయటికి ఎలా వచ్చాడో చుడండి?

Big Crocodile attacks man and swallowed totally. తాజాగా ఓ మొసలి మనిషిని పూర్తిగా మింగేయగా.. అతడిని ఇద్దరు వ్యక్తులు కాపాడుతారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. 
 

Crocodile Video: మనిషిని పూర్తిగా మింగేసిన మొసలి.. బయటికి ఎలా వచ్చాడో చుడండి?

Big Crocodile attacks man and swallowed: సోషల్‌ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా జంతులకు సంబంధించి వీడియోలే ఎక్కువగా  ఉంటాయి. ముఖ్యంగా సింహం, చిరుత, జింక, మొసలి, ఏనుగులకు సంబందించిన వీడియోస్ జనాలను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని సరదాగా ఉంటే.. మరికొన్ని భయందోళనకు గురిచేసేవి కూడా ఉంటాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియో  ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంది. ఓ మొసలి మనిషిని పూర్తిగా మింగేయగా.. అతడిని ఇద్దరు వ్యక్తులు కాపాడుతారు. 

మొసలి ఉభయచర జీవి అన్న విషయం తెలిసిందే. నీటిలోనే కాకుండా భూమిపై కూడా అత్యంత ప్రమాదకరమైన జీవులలో ఒకటి. మొసళ్ళు నీటిలో కొన్నిసార్లు సింహాలనే కాకుండా ఏనుగులను కూడా గడగడలాడిస్తాయి. అలాంటి మొసలికి మనిషి ఓ పెద్ద లెక్క కాదు. ఒక్కసారిగా మింగేస్తుంది. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో తోటలో ఉన్న మొసలి ఓ వ్యక్తిని మొత్తం మింగేస్తుంది. ఇద్దరు వ్యక్తులు మొసలి దగ్గరకు వచ్చి.. తోక ఒకరు పట్టుకోగా, దవడను ఇంకొకరు తెరుస్తాడు. 

ఇంతలో మొసలి కడుపులో ప్రాణాలతో ఉన్న వ్యక్తి తన చేతును బయటికి పెడుతాడు. బయట ఉన్న వ్యక్తి ఆ చేయిని పట్టుకుని బలంగా లాగుతాడు. దాంతో ఆ వ్యక్తి బతుకుజీవుడా అంటూ మొసలి కడుపులో నుంచి బయటకు వస్తాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో బ్యూటీ.వైల్డ్ లైఫ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చాలా మంది ఈ మొసలిని ఫేక్ అని పేర్కొంటున్నారు. 

Also Read: నాగుపాము, ముంగిస మధ్య భీకర పోరు.. చివరకు ఏది గెలిచిందంటే! ఊహించని ట్విస్ట్

Also Read: విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన బాబర్ ఆజ‌మ్.. టీ20ల్లో అరుదైన ఘనత!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More