Home> సోషల్
Advertisement

Crocodile Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు!

Crocodile Funny Video, Crocodile Attacks Trainer. తాజాగా మొసలికి సంబందించిన సరదా వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. 
 

Crocodile Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు!

Crocodile Attacks Trainer: సోషల్‌ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో జంతులకు సంబంధించి వీడియోలు ఎక్కువగా ఉంటాయి. సింహం, చిరుత, మొసలి, ఏనుగులకు సంబందించినవి నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు భయానకరంగా ఉంటాయి. తాజాగా మొసలికి సంబందించిన సరదా వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. నోట్లో చేయిపెట్టిన ట్రైనర్‌కు మొసలి చుక్కలు చూపించింది.

థాయ్‌లాండ్‌లోని 'కావ్ యాంగ్' అనే నేషనల్ పార్కుకు భారీ సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. థాయ్‌లాండ్‌ నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి ఈ పార్కును చూడడనికి పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో పార్కును సిబ్బడ్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతారు. అంతేకాదు అందులోని జంతువులను కూడా తరచూ పరీక్షిస్తుంటారు. ఈ క్రమంలోనే మొసలి నోటిలో చేతిని పెట్టిన ట్రైనర్‌కు చుక్కలు చూపించింది. 

ట్రైనర్‌ మొసలి నోటిలో చేయిపెట్టి ఏదో చేస్తుండగా.. దానికి కోపమొచ్చింది. దాంతో తెరచి ఉన్న దవడలను ఒక్కసారిగా మూసేసి చేతిని కొరికింది. దీంతో ఆ ట్రైనర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఆ ట్రైనర్‌ చేయి ఉందో లేదో వీడియోలో చూపించలేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను animals_powers అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఈ దృశ్యాన్ని చూస్తే ఎవరైనా భయాందోళనకు గురవుతారు. మీరూ ఓ లుక్కేయండి. 

Also Read: Kolkata Gay Couple: కుటుంబ సభ్యుల సమక్షంలో.. సంప్రదాయబద్ధంగా ఒక్కటైన ఇద్దరు మగాళ్లు!

Also Read: Lion Video: మహిళ ముందు సింహం కూడా పిల్లి అవుతుంది.. ఇదిగో ప్రూఫ్! వీడియో చూస్తే షాక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Read More