Home> సోషల్
Advertisement

Crocodile Boy Viral Video: సినిమా కాదు.. ఒళ్ళు గగుర్పొడిచే రియల్ సీన్! మొసళ్ల మధ్యలో బాలుడు

Boy narrow escaped from Crocodiles in Chambal River. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ మొసళ్ల మధ్యలో ఉన్న ఓ బాలుడిని కొందరు రక్షిస్తారు. 
 

Crocodile Boy Viral Video: సినిమా కాదు.. ఒళ్ళు గగుర్పొడిచే రియల్ సీన్! మొసళ్ల మధ్యలో బాలుడు

Boy was narrow escaped from Crocodiles in Chambal River: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. ఎక్కువగా మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోలు వైరల్ అవుతాయి. సింహం, చిరుత, ఏనుగు, మొసలి, కోతి, కుక్క, పిల్లి, పాములకు సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం భయభ్రాంతులకు గురిచేస్తాయి. తాజాగా ఒళ్ళు గగుర్పొడిచే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ మొసళ్ల మధ్యలో ఉన్న ఓ బాలుడిని కొందరు రక్షిస్తారు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం చంబల్ నదిలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. చంబల్ నదిలో భారీగా మొసళ్ళు ఉంటాయి. అయితే ఓ బాలుడు ఆ నదిలో పడిపోయాడు. బాలుడు నీటిలో మునిగిపోతూ ప్రాణాల కోసం పోరాడాడు. అయితే అతడి చుట్టూ మొసళ్ళు ఉన్నాయి. దాంతో బాలుడు భయంతో వణికిపోయాడు. మునిగిపోతున్న బాలుడిని రక్షించడానికి రెస్క్యూ టీమ్ పడవలో వెళ్ళింది.  మొసళ్ళ మధ్యలోంచి వెళ్లిన రెస్క్యూ టీమ్ బాలుడు వద్దకు చేరుకొని.. అతడి చేయి పట్టుకుని పడవలోకి లాగారు. 

రెస్క్యూ టీమ్ బాలుడు వద్దకు సరైన సమయంలో చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వీడియోను యూపీ పోలీసు అధికారి సచిన్ కౌశిక్ హ్న ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 'ఇది సినిమా లాంటి నిజమైన దృశ్యం. ఈ పిల్లవాడు చంబల్ నదిలో పడిపోయాడు. బాలుడు వెనుక మొసళ్ళు ఉన్నాయి. రెస్క్యూ టీమ్ సరైన సమయానికి చేరుకుని బాలుడిని రక్షించారు.వారికి నా సెల్యూట్' అని పేర్కొన్నారు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అందరూ రెస్క్యూ టీమ్ బాలుడిని రక్షించడానికి సకాలంలో చేసిన ప్రయత్నాలను ప్రశంసిస్తున్నారు. 'రెస్క్యూ టీమ్‌కి సెల్యూట్‌' అని ఒకరు కామెంట్ చేయగా.. 'సినిమా కాదు.. ఒళ్ళు గగుర్పొడిచే రియల్ సీన్' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ఈ వీడియోకి లైకుల, షేర్ల వర్షం కురుస్తోంది. 

Also Read: విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని కోరుకుంటున్నా.. మా జట్టుపై మాత్రం చేయకూడదు!

Also Read: తొలి మ్యాచ్‌లో శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ ఢీ.. హెడ్-టు-హెడ్ రికార్డ్స్, తుది జట్లు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More