Home> సోషల్
Advertisement

Love Proposal: ఇది 'ప్రేమ దోపిడీ'.. ఇతగాడి 'లవ్‌ ప్రపోజ్'‌ చూస్తే మీరు ప్రేమలో పడతారు

Valentine's Day 2024: ప్రేమ అనేది వర్ణించలేని భావన.. భావోద్వేగం. అది లేనిది జీవ ప్రపంచం మనుగడ లేదు. అలాంటి ప్రేమను తెలపడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. సాదాసీదాగా చెబితే ఆ ప్రేమకు విలువ ఉండదు. భిన్నంగా.. సరికొత్త రీతిలో చెబితే ప్రేమించే వ్యక్తులు కూడా సంభ్రమాశ్చార్యలకు లోనవుతారు. ఆ క్షణంలో వారి ముఖంలో ఉండే వెలుగు, వారికి కలిగే భావన ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. అదే విధంగా భావించిన ఓ ప్రేమికుడు తన ప్రేయసికి భిన్నంగా తన ప్రేమను తెలిపాడు. ఇది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Love Proposal: ఇది 'ప్రేమ దోపిడీ'.. ఇతగాడి 'లవ్‌ ప్రపోజ్'‌ చూస్తే మీరు ప్రేమలో పడతారు

 Colombia Young Man Love Propose: కొలంబియాలోని ఓ వ్యక్తి తన ప్రేయసికి ప్రపోజ్‌ చేయాలనుకున్నాడు. అందరిలాగా పువ్వు ఇచ్చి.. రింగ్‌ తొడిగి సాదాసీదాగా చెప్పాలనుకోలేదు. విభిన్నంగా.. ఆమె అవాక్కయ్యేలా చేద్దామని భావించాడు. పక్కా ప్రణాళిక వేశాడు. దానికి అతడి స్నేహితులు కూడా సహకరించడంతో అతడి ప్రేమబంధం విజయవంతమైంది. అచ్చం సినిమాల్లో మాదిరి స్టన్నింగ్‌తో చేసిన ప్రపోజల్‌ నచ్చేసి ఆ ముద్దుగుమ్మ అతడి ప్రేమకు పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది.

వీడియోలో ఒక రోడ్డుపై కారు వస్తుండగా కొందరు ద్విచక్ర వాహనాలతో అడ్డగిస్తారు. దొంగల మాదిరి వేషాలు వేసుకుని బైక్‌లతో అడ్డగించి కారులో ఉన్న యువతీయువకులను బెదిరిస్తారు. కారు దిగండి అంటూ అరుచుకుంటూ బెదిరింపులకు పాల్పడతారు. వారిని కారు నుంచి దింపేసి రోడ్డు మీదకు తీసుకొస్తారు. యువకుడిని మోకాళ్లపై నిలబెడతారు. అతడి ముందు యువతి నిలిచేలా చేస్తారు. ఆ కొద్దిసేపటికి యువకులంతా అరవడం ఆపేస్తారు. అనంతరం మోకాళ్లపై నిలిచిన యువకుడు జేబులో నుంచి ఉంగరం తీసి తన ప్రేయసికి ప్రేమ విన్నపం చేస్తాడు. ఈ పరిణామానికి ప్రేయసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది.

 
 
 
 
 

అతడి ప్రపోజ్‌ను చూసి ఏం చేయాలో తెలియక కొన్ని క్షణాలు నివ్వెరబోయింది. తల పట్టుకుని 'ఓ మై గాడ్‌' అని అనేసింది. ఆ క్షణానికి ఎలా స్పందించాలో తెలియక తికమక పడింది. అనంతరం అతడు ఇచ్చిన ఉంగరం తొడిగి అతడి కౌగిట్లో వాలిపోయింది. అనంతరం వీరిద్దరూ ముద్దుతో తమ ప్రేమబంధాన్ని బంధించేశారు. అప్పటి దాకా దొంగలుగా నటించిన యువకులు వెంటనే కేరింతలు కొడతారు. ఈ తతంగమంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అతడు చేసిన లవ్‌ ప్రపోజ్‌ను చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రేమ ప్రతిపాదనే ఇంత భిన్నంగా చెప్పాడంటే అమ్మడు ఇక నీ జీవితం కూడా ఎంత ప్రత్యేకంగా ఉంటదో చూసుకో అని కొందరు కామెంట్‌ చేస్తున్నారు. మరికొందరేమో అతడు చేసిన పనిని తింగరి చర్యగా పేర్కొంటూ విమర్శలు చేస్తున్నారు. అమ్మాయిని భయపెట్టావు కదా రా.. ఇన్ని వేషాలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా అతడు చేసిన లవ్‌ ప్రపోజల్‌ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రేమికుల దినోత్సవం సమీపిస్తుండడంతో ప్రేమికులకు ఈ వీడియో ఒక ఐడియా ఇచ్చినట్లయ్యింది.

Also Read: Konda Surekha: జగన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అక్క.. ఏపీ రాజకీయాల్లోకి కొండా సురేఖ

Also Read: Telangana High Court: తెలంగాణలో అనూహ్య మలుపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

  

Read More