Home> సోషల్
Advertisement

Kid Playing with King Cobra: అరేయ్.. అది పామురా.. బెల్ట్ కాదు.. 4 అడుగుల పాముతో ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలుడు

Kid Playing with Huge King Cobra: ప్రస్తుతం నెట్టింట్లో పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే ఓ పిల్లాడు పాముని ఇంట్లోకి లాక్కెళ్ళడం సన్నివేశాలు సోషల్ మీడియాలో షేక్ అవుతున్నాయి. మీరు కూడా ఒకసారి ఈ వీడియోని చూడండి. 

Kid Playing with King Cobra: అరేయ్.. అది పామురా.. బెల్ట్ కాదు.. 4 అడుగుల పాముతో ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలుడు

Kid Playing with Huge King Cobra: ప్రపంచంలో ప్రమాదకరమైన పాములు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో అతి భయంకరమైన పాములు కొండచిలువలు అయితే ప్రమాదకరమైన పాములు కింగ్ కోబ్రాలని చెప్పవచ్చు. ఎందుకంటే కింగ్ కోబ్రాలు ఒక్కసారి కాటేస్తే జంతువైన మనిషైనా మరణించాల్సిందే. అయితే ఇటీవలే నెట్టింట వైరల్ అవుతున్న వీడియో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వీడియోలో ఐదేళ్ల వయసు గల బాబు.. అతి భయంకరమైన కింగ్ కోబ్రా ను ఆట బొమ్మల ఆడుకున్నాడు. అవును నిజం ఇది.. మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

ఈ వీడియోలో గమనిస్తే ఐదేళ్ల వయసు గల పిల్లాడు ఓ ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ను తన ఎడమ చేతితో ఆట వస్తువుల లాక్కొని వెళ్లడం మీరు గమనించవచ్చు. కొన్ని పాములు పిల్లలను ఏం చేయవని తరచుగా వార్తల్లో చూసి ఉంటాం. ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది. 

అలా పిల్లాడు ఆ కింగ్ కోబ్రాను ఇంట్లోకి లాక్కొని వెళ్లే క్రమంలో తన తండ్రి కొడుకును రక్షించేందుకు.. పాముతో పాటు తన కుమారుడిని కూడా ఇంట్లో నుంచి లాక్కొచ్చాడు. అక్కడున్న చాలామంది పిల్లాడు పాముని లాక్కొని వెళ్లడం చూసి తెగ ఆశ్చర్యానికి గురయ్యారు. మరికొందరైతే కేకలు వేస్తూ పరుగులు తీశారు.

Also Read: Railway Jobs 2023: రైల్వేలో భారీగా ఉద్యోగాలు, ఇవాళే ఆఖరు తేదీ, వెంటనే అప్లై చేయండి

ఆ పిల్లాడు కేవలం కింగ్‌ కోబ్రా తోకను మాత్రమే పట్టుకుని లాక్కెళ్లాడు. ఒకవేళ తలను పట్టుకొని ఉంటే కాటేసేది. కొన్ని పాములు ప్రమాదకరమైనప్పటికీ వాటికి స్పర్శ లేకపోవడం వల్ల కాటయ్యవని, విషాన్ని చిమ్మవని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పిల్లాడికి సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తెగ ఆశ్చర్యపోతున్నారు. 

ఈ వీడియోను ఫీల్ గ్యాన్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను 11 వేల మందికి పైగా వీక్షించగా.. చాలామంది నటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా ఈ వీడియో ఆశ్చర్యకరంగా ఉండడంతో ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు.

Also Read: Telangana Formation Day: ఇదో మైలురాయి.. నా జీవితం ధన్యమైంది: సీఎం కేసీఆర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More