Home> సోషల్
Advertisement

యూపీలో ఎస్పీకి బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్

ఉత్తరప్రదేశ్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరైన బీజేపీ ఎమ్మెల్యే, పోలీస్ సూపరింటెండెంట్ పై నోరు పారేసుకున్నారు

యూపీలో ఎస్పీకి బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్

ఉత్తరప్రదేశ్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరైన బీజేపీ ఎమ్మెల్యే, పోలీస్ సూపరింటెండెంట్ పై నోరు పారేసుకున్నారు. నోటికి ఇష్టం వచ్చిన్నట్లు తిట్టారు కూడా. పోలీస్ అధికారి ఎమ్మెల్యేను గుర్తుపట్టకుండా.. ఎవరో బయట వ్యక్తి అని తలచి సభా ప్రాంగణంలోకి అనుమతించకపోవడతో ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఎప్పుడైతే పోలీస్ అధికారి తనను సభలోకి అనుమతించలేదో బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ బాజ్పాయ్ ఆయనపై విరుచుకుపడ్డారు. బాజ్పాయ్ అలహాబాద్ ఉత్తర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. అయితే పోలీస్ అధికారిని ఆయన గదమాయించిన వీడియోను ఏఎన్ఐ విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే పోలీస్ ఎమ్మెల్యేను గుర్తుపట్టకపోవడం అనేది పొరపాటు అయినప్పటికీ.. ఎమ్మెల్యే కూడా తన హుందాతనాన్ని మరిచిపోయి ప్రవర్తించడంతో కూడా నెటిజన్ల నుండి విమర్శలు వెలువెత్తాయి.

Read More