Home> సోషల్
Advertisement

స్పృహ కోల్పోయిన లేడీ డ్రైవర్.. ప్రాణాలకు తెగించి ఆ కారుకు తన కారును అడ్డుపెట్టి.. వైరల్ వీడియో

ఏమైనా సరే ఆ కారు ఆపి అందులో ఉన్న మహిళను రక్షించాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా క్షణం ఆలస్యం లేకుండా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఆ కారు దాటేసి ముందుకు వెళ్లాడు. ఆ తర్వాత ఆ యువకుడు ఏం చేశాడు ? ఎలా ఆ యువతిని రక్షించాడు ? ప్రాణాలకు తెగించి ఆ యువకుడు చేసిన పని ఎలాంటి ఫలితాన్నిచ్చింది ? అన్ని ప్రశ్నలకు జవాబు తెలియాలంటే ఈ వీడియో చూడండి.

స్పృహ కోల్పోయిన లేడీ డ్రైవర్.. ప్రాణాలకు తెగించి ఆ కారుకు తన కారును అడ్డుపెట్టి.. వైరల్ వీడియో

రోడ్డుపై వెళ్తున్న ఓ కారు ఉన్నట్టుండి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గడ్డిపైకి దూసుకెళ్లింది. అదే వేగంతో ఒక పద్ధతిలో కాకుండా అటు, ఇటూ వెళ్తోంది. చివరకు అదే వేగంతో వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న గార్డ్ రెయిలింగ్ ని ఢీకొన్నప్పటికీ.. కారు వెళ్లడం మాత్రం ఆగలేదు. కారు వెళ్తున్న విధానాన్ని చూసిన మరో కారు డ్రైవర్ దూరం నుంచే చూసి ఏం జరుగుతుందో అర్థం చేసుకున్నాడు. అవతలి కారులో డ్రైవింగ్ సీటులో కూర్చుని ఉన్న లేడీ స్పృహలో లేకపోవడం వల్లే ఆ కారు అదుపు తప్పినట్టు గ్రహించాడు. 

ఇలాంటి సమయంలో కొంతమంది భయంతో ఏం చేస్తారు ? మనకెందుకు వచ్చిన గొడవలే.. రిస్కు తీసుకుని దగ్గరికి వెళ్తే.. ఆ కారు ఢీకొని ఏమైనా జరిగే ప్రమాదం ఉందని దూరం జరుగుతారు. ఆ కారు దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా దూరం నుంచే గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆమెను కాపాడే క్రమంలో ఆ కారు వచ్చి ఢీకొందంటే ఒక్కోసారి ప్రాణాలే పోవచ్చు లేదా తీవ్రమైన గాయాలైనా కావొచ్చు అనేది వారి భయం కావొచ్చు. చాలా శాతం రోడ్డు ప్రమాదాల్లో జరిగేది అదే కాబట్టి.. ఆ భయంతోనే ఎవరైనా దగ్గరికి వెళ్లే సాహసం చేయరు. కానీ ఇక్కడ ఇతను మాత్రం అలా భావించలేదు. ధైర్యంతో చాలా తెలివిగా ఆలోచించాడు. 

ఏమైనా సరే ఆ కారు ఆపి అందులో ఉన్న మహిళను రక్షించాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా క్షణం ఆలస్యం లేకుండా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఆ కారు దాటేసి ముందుకు వెళ్లాడు. ఆ కారు వచ్చి తన కారును వెనక నుంచి ఢీకొట్టి ఆగిపోయేలా తన కారును ఆ కారు ముందే పెట్టాడు. ప్రాణాలకు తెగించి ఆ యువకుడు చేసిన ప్రయత్నం ఫలించింది. అనుకున్నట్టుగానే ఆ లేడీ నడుపుతున్న కారు వచ్చి ముందున్న కారును ఢీకొట్టి ఆగిపోయింది.

Also read : వెళ్తున్న ట్రక్కులోంచి కిందపడిన కరెన్సీ నోట్లు.. ఏరుకున్నోళ్లకు ఏరుకున్నంత.. వైరల్ వీడియో

ఆ తర్వాత ఆ యువకుడు కారు లోంచి కిందకు దిగి వచ్చి వెనకాల కారులో ఉన్న మహిళను రక్షించాడు. ఇదంతా ఆ రెండు కార్లను అనుసరిస్తూ వెనకాలే వచ్చిన మరో కారులో ఉన్న డ్యాష్‌కెమెరాలో రికార్డ్ అయింది. చూడ్డానికి సినిమాటిక్‌గా ఉన్న ఈ రియల్ షాట్ నెటిజెన్స్‌ని ఆకట్టుకుంటోంది.

నెదర్లాండ్స్‌లోని నన్‌స్పీట్‌లో గత శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ లేడీని రక్షించిన రియల్ హీరో పేరు హెన్రీ టెమ్మర్‌మన్స్. తాను ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఎదురైన ఈ అనుభవం గురించి హెన్రీ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. తనకు, తన కారుకు ఏమైనా పర్వాలేదు కానీ ఆ మహిళను రక్షించాల్సిందే అనే సంకల్పంతో హెన్రీ చేసిన పనికి నెటిజెన్స్ సాహో అంటున్నారు. మంచి పనికి ఎప్పుడైనా ప్రశంసలే దక్కుతాయి కదా మరి!! అందుకే ఈ వైరల్ వీడియోకు భారీ మొత్తంలో లైక్స్, రిట్వీట్స్, పాజిటివ్ కామెంట్స్, కాంప్లిమెంట్స్ వచ్చిపడుతున్నాయి.

Also read : వైరల్ పిక్: పడగవిప్పిన మూడు పాములు.. ఆశీర్వాదం అనుకో అంటున్న ఐఎఫ్ఎస్ ఆఫీసర్

Also read : Man praying god before stealing hundi: హుండి ఎత్తుకెళ్లడానికొచ్చి ఏం చేశాడో చూడండి.. వైరల్ వీడియో

Also read : 18+ మహిళలకు నెలకు రూ.1000.. పంజాబ్‌లో అరవింద్ కేజ్రీవాల్ హామీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More