Home> సోషల్
Advertisement

Fraud Alert! ఫేస్‌బుక్‌లో ఫుడ్ ఆర్డర్ ఇస్తే.. బ్యాంకు ఖాతా ఖాళీ! మీరు పూర్తి వివరాలు చదవాలి!

Online Fraud : బెంగుళూరుకు చెందిన 58 ఏళ్ల మహిళ ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన చూసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. కానీ ఆమె ఖతాలోంచి రూ.50,000 ఖాళీ అయిపోయాయి.

Fraud Alert! ఫేస్‌బుక్‌లో ఫుడ్ ఆర్డర్ ఇస్తే.. బ్యాంకు ఖాతా ఖాళీ! మీరు పూర్తి వివరాలు చదవాలి!

Online Fraud : కరోనావైరస్ మహమ్మారి ప్రభలడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆన్‌లైన్ మోసాలు కూడా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి మోసాలు రెట్టింపు అయ్యాయి. అమాయక ప్రజలను మోసం చేయడమే సైబర్ క్రిమినల్స్ పనిగా పెట్టుకున్నారు. తాజాగా ఇలాంటి ఒక ఘటన జరిగింది.

Also Read | WhatsApp కొత్త నియమాలను పాటించపోతే ఎకౌంట్ డిలీట్ అవ్వవచ్చు

బెంగుళూరుకు చెందిన 58 ఏళ్ల మహిళ ఫేస్‌బుక్‌లో (Facebook) ఒక ప్రకటన చూసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. కానీ ఆమె ఖాతాలోంచి రూ.50,000 ఖాళీ అయిపోయాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం బెంగుళూరులోని యెలచెనహల్లీ ప్రాంతానికి చెందిన సవిత శర్మ ఒక ప్లేట్ మీల్స్ ధరకే అంటే రూ.250 కు మాత్రమే రెండు ప్లేట్ల మీల్స్ ఇస్తామని ప్రకటించింది.

ఈ వార్త చూసి ఆసక్తిగా అనిపించడంతో ఆర్డర్ ఇవ్వడానికి ఫోన్ చేయగా.. అటువైపు నుంచి ఈ ఆర్డర్ ఇవ్వాలంటే కనీసం రూ.10 చెల్లించాల్సి ఉంటుంది అని తెలిపారు. మిగితా మొత్తాన్ని డిలవరీ సమయంలో ఇవ్వవచ్చు అని వివరించారు. దాంతో వారు పంపిన లింకుపై క్లిక్ చేసి అందులో బ్యాంకుతో సహా అన్ని వివరాలు అందించారు. 

Also Read | Honey: కల్తీ తేనె తీసుకుంటే అసలుకే మోసం, వెంటనే ఇలా టెస్ట్ చేయండి!

తరువాత కొన్ని నిమిషాల తరువాత ఒక నెంబర్ నుంచి ఆమెకు మరో కాల్ వచ్చింది. వారు పిన్ అడిగితే వెంటనే అందించింది సవిత. అలా చేసిన కొన్ని నిమిషాల్లోనే ఆమె ఖాతా నుంచి రూ.49,996 విత్‌డ్రా చేశారు. తను మోసపోయాను (Fraud) అని తెలుకున్న సవిత వెంటనే పోలీసులను సంప్రదించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More