Home> సోషల్
Advertisement

21 ఏళ్లుగా దూరమైన ప్రియురాలి కోసం ఎదురుచూస్తున్న యువకుడు..

ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 21 ఏళ్ల నుండి ప్రియురాలి కోసం ఎదురుచూస్తున్న వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాలి, ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

21 ఏళ్లుగా దూరమైన ప్రియురాలి కోసం ఎదురుచూస్తున్న యువకుడు..

డేటింగ్ యాప్ లు, ఆన్ లైన్ లో ప్రేమ, పెళ్లి అంటూ యువత ఇంటర్నెట్ ప్రపంచానికి బానిసవుతుంటే, ఒక వ్యక్తి  21 ఏళ్ల కిందట దూరమైన ప్రియురాలి కోసం ఇప్పటికీ ఎదురుచూస్తూ, మతి భ్రమించి ఆసుపత్రి పాలయ్యాడు. అదెక్కడంటే.... 

అతడి పేరు నాగరాజన్  (40), దాదాపు 21 ఏళ్ల  కిందట కుటుంబాన్ని పోషించాలనే ఉద్దేశ్యంతో తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఒక చిన్న కిరాణా కొట్టులో పని చేసే వాడు. ఆ సమయంలో ఒక కేరళ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇరువురి ఇష్టం ఉండటంతో పెళ్లి  చేసుకుందామని నిర్ణయించుకున్నారు. వారి వివాహానికి ముందుగా తన తోబుట్టువు పెళ్లి చేయాల్సిందిగా, ప్రియురాలిని వాళ్ల గ్రామం మూలక్కుడికి తీసుకొచ్చాడు.

Also Read: సోషల్ మీడియాలో రష్మిక టాప్, 20 మిలియన్ల ఫాలోవర్లు

ఈ విషయం కాస్త తెలిసిన యువతి తల్లి-తండ్రులు బలవంతంగా తమ కూతురిని తిరిగి కోయంబత్తూర్ కు లాక్కెళ్లారు. ప్రియురాలు ఎన్నటికీ అయినా తన వద్దకి వస్తుందన్న నెపంతో నాగరాజన్  21 ఏళ్లుగా ప్రియురాలి కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఇలా ఎదురుచూస్తూ ఉన్న క్రమంలో మతి స్థిమితం తప్పిన నటరాజన్, కొన్ని రోజుల తరువాత ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రియురాలి కోసం ఎదురుచూస్తూ ఒక చిన్న బండరాయిపై ఉండేవాడు.

అక్కడే చిన్న గూడు లాగా కట్టుకొని ప్రియురాలి కోసం చూసే నాగరాజన్ కు కావాల్సిన ఆహారం, వస్త్రాలు మరియు ఇతరల ఆవసారాలన్ని తల్లి నాగాయి చూసుకునేది. ఎవరితో ఎలాంటి మాటలు లేకుండా ఎదురుచూస్తున్న నాగరాజన్ గురించి తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వైద్యం నిమిత్తము ఆసుపత్రికి తరలించారు.  

Also Read: పాగ‌ల్ ట్రైల‌ర్‌ విడుదల..విశ్వక్ సేన్ కుమ్మేశాడు భయ్యా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More