Home> సోషల్
Advertisement

Variety Marriage: పెళ్లి కోసం ఛార్టెట్ ఫ్లైట్ బుకింగ్, చిక్కుల్లో నవ దంపతులు, బంధువులు

A couple tied the knot on-board a chartered flight: కరోనా నిబంధనలు కఠినతరం కావడంతో తమ పెళ్లికి ముఖ్యమైన అథితులు అందరూ హాజరు కావాలని వారి సమక్షంలో వివాహం చేసుకోవాలని ఆలోచించిన ఓ జంట ఏకంగా విమానంలో ప్రయాణిస్తూ గాల్లోనే పెళ్లి చేసుకున్నారు.

Variety Marriage: పెళ్లి కోసం ఛార్టెట్ ఫ్లైట్ బుకింగ్, చిక్కుల్లో నవ దంపతులు, బంధువులు

కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతున్న వేళ కోవిడ్19 నిబంధనలు కఠినతరం చేశారు. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించగా, పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, పాక్షిక కర్ఫ్యూ అమలు చేసి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ఓ జంట చేసిన పనికి అంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. 

కరోనా నిబంధనలు కఠినతరం కావడంతో తమ పెళ్లికి ముఖ్యమైన అథితులు అందరూ హాజరు కావాలని వారి సమక్షంలో వివాహం చేసుకోవాలని ఆలోచించిన ఓ జంట ఏకంగా విమానంలో ప్రయాణిస్తూ గాల్లోనే పెళ్లి (Madurai Couple Wedding) చేసుకున్నారు. తమిళనాడులో కోవిడ్19 (Covid-19) నిబంధనలు పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా వివాహానికి గరిష్టంగా 50 మందిని అనుమతిస్తున్నారు. దీంతో అమ్మాయి, అబ్బాయి కుటుంబసభ్యులు ఏకంగా 161 మందికి స్పైస్‌జెట్ చార్టెట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. రెండుగంటల ప్రయానికి చార్టెట్ ఫ్లైట్ బుక్ చేసుకుని, మధురై నుంచి బెంగళూరుకు ప్రత్యేక విమానం ప్రయాణిస్తుండగా రాకేష్, దక్షిణల వివాహం వినూత్నంగా జరిగింది. 

Also Read: India Corona Deaths: భారత్‌లో 3 లక్షలకు చేరిన COVID-19 మరణాలు, అదొక్కటే ఊరట

ఆదివారం ఉదయం జరిగిన ఈ వివాహానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు, డీజీసీఏ అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎస్ సెంథిల్ వల్వన్ విమానంలో వివాహంపై స్పందించారు. చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకున్న విషయం నిజమేనని, అయితే కేవలం ప్రయాణానికి అనుమతి మాత్రమే ఉందన్నారు. విమాన ప్రయాణంలో వివాహం జరిపిస్తున్నారనే విషయం తమకు తెలియదన్నారు. ఇంకా చెప్పాలంటే కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి సమయంలో భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా కోవిడ్19 నిబంధనల ఉల్లంఘన జరిగిందన్నారు. వీరిపై కచ్చితంగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

Also Read: LIC Policy: ఒక్కసారి డిపాజిట్ చేస్తే ప్రతినెల రూ.6,859 మీ చేతికి అందిస్తున్న ఎల్ఐసీ

మరోవైపు డీజీసీఏ సైతం విమానంలో వివాహంపై చర్యలు చేపట్టింది. ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని ఎయిర్‌లైన్స్ మరియు ఎయిర్‌పోర్ట్ అధికారులను ఆదేశించింది. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనా వేళ భూమి మీద అడ్డంకి అనుకున్నారో లేదా ఆకాశంలో ఏ ఇబ్బంది ఉండదని భావించారో.. మొత్తానికి పెళ్లి చేసుకున్న జంట, వారి బంధువులు సమస్యల్లో చిక్కుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More