Home> సోషల్
Advertisement

Heart stroke: విధుల్లో ఉండగా గుండెపోటు.. కుప్పకూలీన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి.. వీడియో వైరల్..

Uttar pradesh: బ్యాంక్ లో మెనెజర్ విధులు నిర్వహిస్తున్నాడు. ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో సీట్లోనే కుప్పకూలీపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Heart stroke: విధుల్లో ఉండగా గుండెపోటు.. కుప్పకూలీన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి.. వీడియో వైరల్..

30 years old hdfc bank employee suffers heart stroke: ప్రస్తుతం అందరి జీవనవిధానం మారిపోయింది. ఆహరపు అలవాట్లు,నిద్ర మొదలైనవి పూర్తిగా అబ్ నార్మల్ గా ఉంటున్నాయి. కొందరు ఫుడ్ విషయంలో పూర్తిగా నెగ్లీజెన్సీతో ఉంటున్నారు. జంక్ ఫుడ్ లకు బానిసగా మారుతున్నారు. అంతేకాకుండా.. ఆరోగ్య జీవగడియారం పూర్తిగా పాడుచేసుకుంటున్నారు. ముఖ్యంగా నైట్ షిఫ్ట్ లవల్ల జనాల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని చెప్పుకొవచ్చు. తినాల్సిన సమయంలో పడుకోవడం, పడుకోవాల్సిన టైమ్ లో వర్క్ చేయడం మొదలైనవి ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే..మరోవైపు ఆఫీసుల్లో టెన్షన్ లు, వ్యక్తిగత జీవితంలో గందర గోళ పరిస్థితులు, ఒత్తిడుల వల్ల మనిషి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు.  

 

ఇటీవల ఎక్కువగా జనాలు గుండెపోటుతో చనిపోతున్నారు. ఒకప్పుడు పెద్దవాళ్లలో గుండెపోటుల సమస్య ఎక్కువగా ఉండేది. కానీ  ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. టీనేజ్ వారు సైతం.. హర్ట్ స్ట్రోక్ తో చనిపోవడం మాత్రం ఆందోళన కల్గించే అంశంగా మారింది. ఇప్పటికే కొందరు అప్పటి వరకు పెళ్లిలో, బరాత్ లో, వేడుకల్లో జోష్ గా స్టెప్పులు వేసి,కాసేపట్లోనే కుప్పకూలీనిపోయిన ఘనటలు అనేకం వార్తలలో నిలిచాయి. ఈ క్రమంలో తాజాగా, మరో ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పూర్తి వివరాలు..
 

ఉత్తర ప్రదేశ్ లో లఖ్ నవూలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజేష్ కుమార్ శిందే అనే యువకుడు హెచ్‌డీఎఫ్‌సీ మెనెజర్ గా పనిచేస్తున్నాడు. అత్యంత చిన్న వయస్సులో 30 ఏళ్ల లోనే మెనెజర్ గా ఎంపికయ్యాడు. ఈ  క్రమంలో తన విధుల్లో భాగంగా గురువారం ఆఫీస్ కు వచ్చాడు. తన క్యాబిన్ లో కూర్చుని విధులు నిర్వహిస్తున్నాడు . ఇంతలో ఏమైందో కానీ.. ఒక్కసారిగా అతను గుండెలో నొప్పితో వెనక్కు వంగిపోయాడు. అతను బాధతో విలవిల్లాడిపోతున్నాడు.

Read more: Serial bride: నిత్య పెళ్లి కూతురికి హెచ్ఐవీ పాజిటివ్.. లబో దిబో మంటున్న యువకులు.. ఎక్కడో తెలుసా..?

ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో ఉద్యోగి.. రాజేష్ ను గమనించాడు. వెంటనే అక్కడున్న వారితో కలిసి సీపీఆర్ కూడా చేశారు. కానీ అతను మాత్రం రెస్పాండ్ కాలేదు. వెంటనే తోటి ఉద్యోగులు హుటా హుటీన ఆస్పత్రికి తరలించారు. అతడిని టెస్ట్ చేసిన వైద్యులు అప్పటికే చనిపోయాడని చెప్పేశారు. దీంతో ఉద్యోగులు, కుటుంబ సభ్యులు షాకింగ్ లో ఉండిపోయారు. అప్పటి వరకు తమతో మాట్లాడుకుంటూ పనులు చేసిన వ్యక్తి కుప్పకూలీపోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగి గుండెపోటుతో కుప్పకూలీన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More