Home> సోషల్
Advertisement

Viral Video: అర్ధరాత్రి 10 కి.మీ. పరుగెత్తుతున్న యువకుడు.. స్టార్ డైరెక్టర్ లిఫ్ట్ ఇస్తానన్నా వద్దన్నాడు! కారణం ఏంటంటే?

19 Years Old Pradeep Mehra runs 10 km every Midnight after work. ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏళ్ల ప్రదీప్‌ మెహ్రా ఆర్మీలో చేరేందుకు ఉదయం సమయం కుదరకపోవడంతో.. అర్ధరాత్రి 10 కిలోమీటర్లు రోడ్డుపై పరుగులు తీస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

 Viral Video: అర్ధరాత్రి 10 కి.మీ. పరుగెత్తుతున్న యువకుడు.. స్టార్ డైరెక్టర్ లిఫ్ట్ ఇస్తానన్నా వద్దన్నాడు! కారణం ఏంటంటే?

19 Years Old Pradeep Mehra runs 10 km every Midnight after work: ఈ ప్రపంచంలో ప్రతిఒక్కరికి ఓ కల ఉంటుంది. దాన్ని సాకారం చేసుకునేందుకు ఎన్నో కష్టాలు పడతారు. ముఖ్యంగా పేద ప్రజలు. చదువుకోవడానికి, ఉద్యోగం కోసం కోసం పార్ట్ టైం పనులు చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ కోవకు చెందినవాడే ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏళ్ల ప్రదీప్‌ మెహ్రా. ఆర్మీలో చేరేందుకు ఉదయం సమయం కుదరకపోవడంతో.. అర్ధరాత్రి 10 కిలోమీటర్లు రోడ్డుపై పరుగులు తీస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. విషయంలోకి వెళితే... 

ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రదీప్‌ మెహ్రాది పేద కుటుంబం. నోయిడాలో తన సోదరుడితో కలిసి ఉంటూ.. మెక్‌ డోనాల్డ్స్‌లో పని చేస్తున్నాడు. ప్రదీప్‌ తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తన అమ్మకు అయ్యే ఖర్చు కోసం ప్రదీప్‌, అతడి సోదరుడు జాబ్ చేస్తున్నారు. ప్రదీప్‌ తను పని చేసే మెక్‌ డోనాల్డ్స్‌ నుంచి ఇంటికి 10 కిలోమీటర్ల దూరం. ప్రతిరోజు విధులు పూర్తయ్యాక తర్వాత అర్ధరాత్రి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో గత శనివారం అర్ధరాత్రి ప్రదీప్‌ పరుగెడుతుంటే.. బాలీవుడ్ డైరెక్టర్ వినోద్‌ కాప్రి కంటపడ్డాడు. కారును స్లో చేసి లిఫ్ట్‌ కావాలా అని అడగ్గా.. వద్దు అని చెప్పాడు.  

డైరెక్టర్ వినోద్‌ కాప్రి కారులో ఉండి ప్రదీప్‌ మెహ్రాను ప్రశ్నలు అడిగారు. వినోద్‌ కాప్రి అడిగిన ప్రశ్నలకు ప్రదీప్‌ పరుగెత్తుతూనే సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వీడియోను వినోద్‌ ఆదివారం సాయంత్రం తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసారు. 'ప్రదీప్‌ ఓ అద్భుతమైన వ్యక్తి. అతడి కథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం' అని పేర్కొన్నారు. ఈ వీడియో పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే నెట్టింట వైరల్‌ అయ్యింది. కేవలం 12 గంటల్లోనే 4 లక్షల మంది వీడియోను చూశాను. ప్రదీప్‌ పట్టుదలను అందరూ కొనియాడుతున్నారు.

# వినోద్‌: బాబు ఏమైనా సమస్యనా.. రా నేను డ్రాప్‌ చేస్తా?
ప్రదీప్‌: అదేం లేదు.. నేను పరిగెత్తుకుంటూనే వెళ్తాను

# వినోద్‌: ఎందుకు అలా పరిగెడుతున్నావ్‌?
ప్రదీప్‌: నేను రోజూ ఇలాగే ఇంటికి వెళ్తాను

# వినోద్‌: ఎక్కడ పనిచేస్తావ్‌?
ప్రదీప్‌: మెక్‌ డోనాల్డ్స్‌

# వినోద్‌: నా కారులో డ్రాప్‌ చేస్తాను.. ఎక్కు
ప్రదీప్‌: వద్దు.. నాకు పరిగెత్తేందుకు టైం దొరకదు

# వినోద్‌: ఎందుకు పరిగెడుతున్నావ్‌?
ప్రదీప్‌: ఆర్మీ జాబ్ కోసం ప్రాక్టీస్‌ చేస్తున్నా

# వినోద్‌: ఉదయమే రన్నింగ్‌కు వెళ్లొచ్చుకదా ?
ప్రదీప్‌: ఉదయం వంట చేసుకుని, పనికి వెళ్లాలి.. సమయం ఉండదు

# వినోద్‌: ఈ వీడియో వైరల్‌ అయితే ఏం చేస్తావ్?
ప్రదీప్‌: నన్ను ఎవరూ గుర్తుపట్టరు. అయినా నేను తప్పు చేయట్లేదు

# వినోద్‌: మనిద్దం కలిసి డిన్నర్ చేద్దాం రా
ప్రదీప్‌: ఇంట్లో సోదరుడు ఉన్నాడు. నేను వెళ్లి వంట చేయాలి

# వినోద్‌: మీ సోదరుడు వంట చేసుకోడా?
ప్రదీప్‌: నైట్‌ షిఫ్ట్‌ ఉంది

 

Also Read: KGF Chapter 2: మీరు అతనికి అడ్డు నిలబడకండి సార్.. 'తూఫాన్' వచ్చేసింది!!

Also Read: The Kashmir Files: 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' సినిమా ఫ్రీగా చూడొచ్చని కక్కుర్తి పడితే.. అంతే సంగతులు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More