PHOTOS

Year Ender 2023: ఈ ఏడాది టీమిండియా బద్దలు కొట్టిన రికార్డులు ఇవే.. ఆ ఒక్కటి తప్ప..!

: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి మినహా ఈ ఏడాది వన్డేల్లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరల్డ్ కప్ కూడా గెలిచి ఉంటే అభిమానుల ఆనందానికి అవ...

Advertisement
1/6

ఈ ఏడాది టీమిండియా బౌలర్లు కేవలం 35 వన్డేల్లో 23.34 సగటుతో ఎకానమీ రేట్ 5.1తో 289 వికెట్లు తీశారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా వన్డేల్లో దుమ్ములేపారు. సఫారీ సిరీస్‌లో అర్ష్‌దీప్ సింగ్, అవేశ్‌ ఖాన్ అదరగొట్టారు.  

2/6

ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే విజయాలు సాధించిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. 35 మ్యాచ్‌లు ఆడగా.. 27 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 7 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. గెలుపు శాతం 79.40గా ఉంది. 2003లో ఆస్ట్రేలియా 35 మ్యాచ్‌లు ఆడి 30 మ్యాచ్‌ల్లో గెలుపొంది టాప్ ప్లేస్‌లో ఉంది.  

3/6

భారత్ ఈ ఏడాది వన్డేల్లో 350+ మార్క్‌ను అత్యధికసార్లు దాటిన జట్టుగా రికార్డు సృష్టించింది. 2019లో వన్డేల్లో ఇంగ్లాండ్ 350 పైగా 7 సార్లు చేయగా.. టీమిండియా ఈ సంవత్సరం 8 సార్లు 350+ రన్స్ చేసింది.   

4/6

2023లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. గిల్ 63.36 సగటుతో, 105.45 స్ట్రైక్ రేట్‌తో 1584 పరుగులు చేశాడు. కోహ్లీ 1377, రోహిత్ 1255 పరుగులతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు.    

5/6

ఈ ఏడాది టాప్ 3 వికెట్‌ టేకర్ల జాబితాలో భారత బౌలర్లు ఉన్నారు. కుల్దీప్ యాదవ్ 30 మ్యాచుల్లో 49 వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ 44, 43 వికెట్లు తీశారు.   

6/6

ఒక క్యాలెండర్ ఇయార్‌లో టీమిండియా 250 సిక్సర్లు బాదింది. ఒక సంవత్సరంలో అంతర్జాతీయ జట్టు బాదిన అత్యధిక సిక్సర్‌లు ఇవే.   





Read More