PHOTOS

World Cup 2023: టీమిండియాను వెంటాడుతున్న ఆ భయం.. నాలుగోస్థానంలో ఆడేదెవరు..?

2023: గత కొన్నేళ్లుగా వన్డేల్లో నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్‌మెన్‌ కోసం టీమిండియా వెతుకుతోంది. టాప్‌ ఆర్డర్ విఫలమైన సందర్భంలో ఒత్తిడిన...

Advertisement
1/6

ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డ కేఎల్ రాహుల్.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఆసియా కప్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రపంచ కప్ 2019లో కొన్ని మ్యాచ్‌లలో 4వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు.  

2/6

ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే ఆశించినస్థాయిలో రాణించకపోవడం నిరాశకు గురిచేస్తోంది. కేఎల్ రాహుల్, అయ్యర్ కోలుకోకపోతే.. సూర్యకే ఛాన్స్ దక్కనుంది.   

3/6

ప్రస్తుతం టీమిండియాకు నాలుగో స్థానంలో ఫస్ట్ ఛాయిస్ శ్రేయాస్ అయ్యర్. గాయం నుంచి కోలుకుని.. పూర్తి ఫిట్‌గా ఉంటే అయ్యర్‌ను నాలుగోస్థానంలో చూడొచ్చు.    

4/6

నాలుగో స్థానంలో మరో ప్రత్యామ్నయం సంజూ శాంసన్. అయితే వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నాడు సంజూ. సెలక్టర్లు సంజూను కూడా ఆప్షన్‌గా ఉంచుకోవచ్చు.  

5/6

ఇషాన్‌ కిషన్‌ను కూడా నాలుగోస్థానంలో ఆడించే ఛాన్స్ ఉంది. ఓపెనింగ్ స్లాట్‌లో ఖాళీ లేకపోవడంతో ఇషాన్‌కు మిడిల్ ఆర్డర్‌లో ఛాన్స్ ఇవ్వొచ్చు. లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మెన్ కావడం కూడా కలిసి వస్తుంది.   

6/6

కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్.. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ నాటికి ఫిట్‌గా ఉంటే అద్భుతమనే చెప్పాలి. మిడిలార్డర్‌లో టీమిండియాకు పెద్ద బూస్ట్ అవుతుంది.  





Read More