PHOTOS

Heavy rains: రాగల మూడు రోజుల్లో మళ్లీ కుండపోత.. తెలంగాణకు కీలక అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం..

మూడు రోజుల్లో భారీగా వర్షంకురుస్తుందని వాతావరణ కేంద్రం ఒక అలర్ట్ ను జారీచేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావ...

Advertisement
1/6
వాతావరణ కేంద్రం:
 వాతావరణ కేంద్రం:

రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్నిరోజులుగా కుండపోతగా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో వాతావరణ కేంద్రం మరోసారి కీలక అలర్ట్ ను జారీచేసింది. ప్రజలు అప్రమత్తంగా కూడా ఉండాలని సూచించింది. ఒక వైపు అస్నా తుఫాన్ వల్ల కూడా వర్షం కురుస్తున్నట్లు తెలుస్తోంది.  

2/6
వాతావరణ కేంద్రం:
 వాతావరణ కేంద్రం:

అదే విధంగా.. మధ్య,  పరిసర ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న  అల్పపీడన ప్రాంతం ఉత్తర దిశగా కదులుతూ ఈరోజు ఉదయం 0830 గం.లకు వాయువ్య,  పరిసర మధ్య బంగాళాఖాతంలో ప్రస్పుటమైన అల్పపీడన ప్రాంతంగా ఏర్పడింది. దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి వున్నది. 

3/6
వాతావరణ కేంద్రం:
 వాతావరణ కేంద్రం:

ఇది ఉత్తర దిశగా కదులుతూ బలపడి  ఉత్తర ఒడిశా,  పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం వద్ద ఈనెల 8న వాయుగుండంగా మారే అవకాశం వుంది. తరువాత ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 3 రోజులలో గంగేటిక్ పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, పరిసర ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగే అవకాశం వున్నది.

4/6
వాతావరణ కేంద్రం:
 వాతావరణ కేంద్రం:

ఋతుపవన ద్రోని ఈరోజు సగటు సముద్ర మట్టానికి బికానర్, కోట,  పెండ్రా రోడ్, పరదీప్, వాయువ్య మరియు పరిసర మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన  ప్రస్పుటమైన అల్పపీడన ప్రాంతం యొక్క కేంద్రం గుండా  కొనసాగుతున్నది. దీని ప్రభావం వల్ల దేశంలో కూడా పలు చోట్ల భారీ గా వర్షం కురనుందని తెలుస్తోంది.  

5/6
వాతావరణ కేంద్రం:
 వాతావరణ కేంద్రం:

అదే విధంగా.. రాగల మూడు రోజుల పాటు.. తెలంగాణలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో.. వాతావరణ కేంద్రం ఒక అలర్ట్ ను జారీచేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.  

6/6
వాతావరణ కేంద్రం:
 వాతావరణ కేంద్రం:

ఈరోజు, రేపు , ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో ఉరుములు,   ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని కూడా వాతావరణ కేంద్రం అలర్ట్ ను జారీ చేసింది.





Read More