PHOTOS

One Nation One Election: కేంద్ర ప్రభుత్వం సంచలనం.. జమిలి ఎన్నికలతో తీరనున్న మోదీ కల

ion One Election Report: దేశంలో అసెంబ్లీ, పార్లమెంట్‌లకు ఒకేసారి ఎన్నికలు జరపాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒకేసా...

Advertisement
1/7
One Nation One Election Approve 1
One Nation One Election Approve 1

One Nation One Election: త్వరలోనే దేశంలో అసెంబ్లీ, పార్లమెంట్‌లకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జమిలి ఎన్నికలు (లోక్‌సభ, అసెంబ్లీలకు కలిపి) నిర్వహించాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.

2/7
One Nation One Election Approve 3
One Nation One Election Approve 3

One Nation One Election: దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రూపొందించిన నివేదికను తాజా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం సంచలనం రేపింది.

3/7
One Nation One Election Approve 5
One Nation One Election Approve 5

One Nation One Election: నివేదిక ఆమోదంతో నరేంద్ర మోదీ కలగన్న 'ఒక దేశం- ఒక ఎన్నిక' (వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌)కు త్వరలోనే సాకారం కానుంది. 

4/7
One Nation One Election Approve 7
One Nation One Election Approve 7

One Nation One Election: వచ్చే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అయితే రాజ్యసభలో ఈ బిల్లు వీగిపోయే ప్రమాదం పొంచి ఉంది.

5/7
One Nation One Election Approve 9
One Nation One Election Approve 9

One Nation One Election: దేశంలో విడతల వారీగా రాష్ట్రాలు, లోక్‌సభకు ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ప్రజాధనం వృథా అవుతుందనే వాదన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ కీలకమైన అంశానికి తాజాగా ఆమోదం తెలపడంతో దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయే అవకాశం ఉంది.

6/7
One Nation One Election Approve 11
One Nation One Election Approve 11

One Nation One Election: కాగా జమిలి ఎన్నికలతో నరేంద్ర మోదీ నియంతలాగా దేశాన్ని ఏలాలని చూస్తున్నట్లు కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనా, రష్యాలోని పాలకుల మాదిరి మోదీ సర్వం తానే అనే రూపంలో జమిలి ఎన్నికలకు వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది.

7/7
One Nation One Election Approve 13
One Nation One Election Approve 13

One Nation One Election: జమిలి ఎన్నికలతో సమయం, డబ్బు వృథా అవుతుంది. కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎదురించే అవకాశం ఉండదనే అభిప్రాయం ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన కలిగిస్తోంది.





Read More