PHOTOS

Tomato Price increase: వామ్మో.. సెంచరీ దాటేసిన టమాటో ధరలు.. ఉల్లి కేజీ ధర ఎంతంటే.?..

మాటా ధరలు మండిపోతున్నాయి. వాతావరణ ప్రభావాలు డిమాండ్ కు సరిపడా సప్లై లేకపోవడం వల్ల టమాటా ధరలు ...

Advertisement
1/6
టమాటా ధరల్లో పెరుగుదల:
టమాటా ధరల్లో పెరుగుదల:

టమాటా ధరలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు వారాల క్రితం మార్కెట్ లో.. కేజీ టమాటాలు 40-60 వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సప్లై తగ్గిపోవడం వల్ల ప్రస్తుతం వీటి ధర సెంచరీని దాటేసింది. చాలా చోట్ల టమాటా ధరలు ఇప్పుడు కేజీకి వందరూపాయలుగా అమ్ముతున్నట్లు తెలుస్తోంది.

2/6
టమాటా ధరల్లో పెరుగుదల:
టమాటా ధరల్లో పెరుగుదల:

మరోవైపు నిత్యావసరల సరుకులు ఒకవైపు, కూరగాయాల ధరలు కూడా పెరుగుతుండటంతో సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారు. సగటు మనిషి ప్రతిరోజు టమాటాలు, ఉల్లిపాయలను ప్రతి ఒక్కరు ఉపయోగిస్తుంటారు. టమాటాలతో ఏ పదార్థమైన వండటం తొందరగా అవుతుంది. 

3/6
టమాటా ధరల్లో పెరుగుదల:
టమాటా ధరల్లో పెరుగుదల:

ఇక పిల్లలు కూడా టమాటాచట్నీ, కూరగాయలను ఎంతొ ఇష్టంగా తింటారు. అందుకే ఎక్కువ మంది టమాటాలను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక మహరాష్ట్రతో  పాటు, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే టమాటాల సప్లై ఆగిపోయినట్లు తెలుస్తోంది.

4/6
టమాటా ధరల్లో పెరుగుదల:
టమాటా ధరల్లో పెరుగుదల:

మారిన వాతావరణ పరిస్థితుల వల్ల చాలా వరకు టమాటాలో పాడైపోయినట్లు సమాచారం. ఇక మనదగ్గర పొలాల్లో నాటిన టమాటాలు చేతికి రావడానికి మరో రెండు నెలల సమయం పడుతుంది. అప్పటి వరకు ఇలాంటి పరిస్థితులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. 

5/6
టమాటా ధరల్లో పెరుగుదల:
టమాటా ధరల్లో పెరుగుదల:

మరోవైపు ఉల్లిపాయలు కూడా అందరిని కన్నీళ్లు పెట్టిస్తుంది. కేజీ ఉల్లిధరలు కూడా వంద రూపాయలకు చేరువయ్యింది. ఇప్పటికు చాలా హోటల్స్, రెస్టారెంట్ లలో ఉల్లి పాయలు లేవని కూడా పబ్లిక్ గా బోర్డులు సైతం పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలకు మాత్రం ఇది వరుస షాక్ లుగా చెప్పుకొవచ్చు.

6/6
టమాటా ధరల్లో పెరుగుదల:
టమాటా ధరల్లో పెరుగుదల:

టమాటాలు, ఉల్లి పాయలు లేకుండా చాలా  వరకు ఏ వంట కూడా చేయడం సాధ్యపడదు. ఇవి రెండు ఉంటే ఏరకపు వంట అయిన సులువుగా, టెస్టీగా చేయడానికి కుదురుతుంది. అందుకే టమాటాలు, ఉల్లిపాయల దిగుమతిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకొవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. 





Read More