PHOTOS

Telangana Vimochana Dinothsavam: తెలంగాణ విమోచన దినోత్సవం.. ఆపరేషన్ పోలో గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ పాయింట్స్..

m: భారత దేశం మొత్తానికి స్వాతంత్య్రం వచ్చిన హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు స్వాతంత్య్రం లభించలేదు.దీంతో ఇక్కడ ప్రజలు ఉద్యమించడంతో నిజాం...

Advertisement
1/6
తెలంగాణ విమోచన దినోత్సవం
తెలంగాణ విమోచన దినోత్సవం

Telangana Vimochana Dinothsavam: అప్పట్లో దీన్ని హైదరాబాద్ సంస్థానంగా పిలిచే వారు. ఈ ప్రాంతంలో తెలంగాణతో పాటు మరాఠ్వాడ (మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు ఉండేవి. అప్పట్లో మొత్తం 16 జిల్లాల్లో 8 జిల్లాలు తెలంగాణ ప్రాంతానికి చెందినవి ఉన్నాయి.

2/6
రజాకార్లు
రజాకార్లు

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్య్రం రాలేదు. దీన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అప్పటికే నిజాం ప్రైవేటు సైన్యం రజాకార్లు ఊర్లపై పడి ప్రజల మాన, ప్రాణాలను దోచుకునే పనిలో పడ్డారు.

3/6
ఏడవ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్
 ఏడవ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్

ఏడవ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు స్వాతంత్య్రం రాకపూర్వమే 1976 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు.

4/6
తెలంగాణ సాయుధ పోరాటం
తెలంగాణ సాయుధ పోరాటం

వివిధ సంఘాలు పార్టీల ప్రతినిధులు, ప్రజాస్వామిక వాదుల, రచయతల, ఆర్య సమాజ్ సహా  ప్రజల సంఘటిత పోరాటంతో హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్య్రం సిద్ధించింది.

5/6
ఆపరేషన్ పోలో
ఆపరేషన్ పోలో

నిజాం సంస్థానంలో జరగుతున్న దురాగతాలను తెలుసుకొని అప్పటి హోం మంత్రి సర్ధార్ పటేల్.. జనరల్ జే.ఎన్. చౌదరి నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 13న సైనిక చర్యకు ఉపక్రమించింది. దానికి ఆపరేషన్ పోలో పేరు పెట్టారు. సైన్యం రెండు భాగాలుగా విడిపోయింది. విజయవాడ నుంచి ఒకటి, బీదర్ దిశగా రెండో బెటాలియన్ కదిలింది.

 

6/6
తెలంగాణ విమోచన దినోత్సవం
తెలంగాణ విమోచన దినోత్సవం

మొదట రజాకార్లు తిరగబడినా ఒకటి రెండు పోరాడినా.. ఫలితం లేకపోయింది. దీంతో లాభం లేదని నిజాం నవాబు ఏమి పాలు పోక లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో బంధించిన భారత ఏజెంట్ కే.ఎం.మున్షీని కలిసి భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఆపరేషన్ పోలో విజయవంతమైంది. అప్పట్లో సైనిక చర్యకు అధ్యక్షత వహించిన సైనిక గవర్నర్ గా పదవీ ప్రమాణం చేశారు. ఎం.కే.వెల్లోడి ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు. 





Read More