PHOTOS

SS Thaman: తమన్ భారీ మ్యూజికల్ ఈవెంట్.. ఎక్కడంటే..?

్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ప్రస్తుతం ఫుల్ క్రేజ్‌లో ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళం అనే తేడా లేకుండా...

Advertisement
1/5
తమన్ సినిమాలు
తమన్ సినిమాలు

ఎప్పుడు సినిమాలతో తీరిక లేకుండా బిజీగా ఉండే తమన్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ భారీ మ్యూజికల్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. అమెరికాలోని డల్లాస్‌లో అతి పెద్ద మ్యూజికల్ ఈవెంట్‌కు శ్రీకారం చుట్టింది.   

2/5
తమన్ మ్యూజికల్ ఈవెంట్
తమన్ మ్యూజికల్ ఈవెంట్

స్పెస్ టూర్‌తో ఈ కార్యక్రమం నిర్వహించనుండగా.. జూన్ 1న ప్రారంభంకానుంది.   

3/5
తమన్ మూవీస్
తమన్ మూవీస్

ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. గుంటూరు కారం నుంచి 'దమ్ మసాలా' అంటూ తమన్ చేసిన హంగామాను ప్రోమోలో చూపించారు. డల్లాస్‌లో ఇప్పటివరకు ఇప్పటివరకు ఎప్పుడు జరగని భారీ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.   

4/5
మ్యూజిక్ డైరెక్టర్ తమన్
మ్యూజిక్ డైరెక్టర్ తమన్

మరోవైపు తమన్‌కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఓ తమిళ సినిమాలో గెస్ట్ రోల్‌లో తమన్ కనిపించనున్నారని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తమిళ యూట్యూబ్ స్టార్ నిహారిక నటిస్తుండగా.. తమన్ చాలా రోజుల తరువాత బిగ్ స్క్రీన్‌పై మెరవనున్నారని తెలుస్తోంది. తమన్ కెరీర్ ఆరంభంలో బాయ్స్ మూవీలో నటించిన విషయం తెలిసిందే.   

5/5
తమన్
తమన్

ఇక తమన్ మ్యూజిక్ అందించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద త్వరలోనే సందడి చేయనున్నాయి. పవన్ కళ్యాణ్‌ ఓజీ, రామ్ చరణ్‌ గేమ్ ఛేంజర్, NBK 109, ప్రభాస్ రాజాసాబ్, రవితేజ RT4GM, అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో తెరకెక్కనున్న AA22 మూవీకి తమన్ సంగీతం అందించనున్నారు. వీటితోపాటు తమిళ సినిమాలతో కూడా ఆడియన్స్‌ను అలరించనున్నారు.  





Read More