PHOTOS

Raksha bandhan 2024: రాఖీ పౌర్ణమి రోజు.. కొత్తగా యజ్ఞోపవీతం ధరిస్తారు.. ఎందుకో తెలుసా..?

సంలో వచ్చే పౌర్ణమి అంటే అందరికీ రాఖీ పౌర్ణమి గుర్తొస్తుంది. అయితే హిందూ ధర్మంలో చాలామంది జంధ్యాన్ని ధరించేవారికి శ్రావణి పౌర్ణమి అంటే ...

Advertisement
1/6
రాఖీ పౌర్ణమి 2024:
 రాఖీ పౌర్ణమి 2024:

ఉపనయన సమయంలో ధరించే జంధ్యాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణిమ రోజున పాత జంధ్యాన్ని తీసేసి క్రొత్తదాన్ని ధరిస్తారు దీన్ని  ఉపాకర్మ అంటారు. ఉపాకర్మను యఙ్ఞోప‌వీతం పేరుతో పిలుస్తుంటారు. 

2/6
రాఖీ పౌర్ణమి 2024:
 రాఖీ పౌర్ణమి 2024:

యజ్ఞోపవీతం అంటే యాగ కర్మతో పునీతమైన దారం అని అర్థం. ఈ జంధ్యం ధరించినవారే వేద్యాధ్యయనానికి అర్హులుగా చెబుతుంటారు. గాయత్రి అనుగ్రహం కల్గుతుందని చెబుతుంటారు.అందుకే..వేదాధ్యయనం నేర్చుకోవాలంటే   ఉపాకర్మను ఆచరించాలి. దీనికి ముందు ఉపనయనం జరిపించి జంధ్యాన్ని వేయడం ఆచారం.

3/6
రాఖీ పౌర్ణమి 2024:
 రాఖీ పౌర్ణమి 2024:

యఙ్ఞోప‌వీతం ధరించినవారిని ద్విజులు అంటారు. ద్విజులు అంటే రెండు జన్మలు కలవారని అర్థం. అంటే ఇక్కడ మరణించి మళ్ళీ జన్మించడం కాదు. తల్లి గర్భం నుంచి జన్మించడం మొదటిది అయితే, ఉపనయనం తరువాత గురువు నుంచి ఙ్ఞానాన్ని పొందడం రెండోది అని అర్థం.

4/6
రాఖీ పౌర్ణమి 2024:
 రాఖీ పౌర్ణమి 2024:

ఉపనయన సమయంలో యఙ్ఞోపవీతానికి కొన్ని చోట్ల జింక చర్మాన్ని కడతారు. దీనిని ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి రోజు వదిలిపెడతారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు జంధ్యాన్ని మార్చుకోవడం పరిపాటి.  గాయత్రీ పూజచేసి కొత్త యఙ్ఞోపవీతాన్ని ధరించి పాతది విసర్జించాలి.  

5/6
రాఖీ పౌర్ణమి 2024:
 రాఖీ పౌర్ణమి 2024:

జంధ్యా ధరించడం వల్ల మనలో దైవీక శక్తులు మేల్కొల్పబడతాయి. గాయత్రి దేవత అనుగ్రహం కల్గుతుందని చెబుతుంటారు.  గాయత్రి దేవిని  పూజిస్తే వేదాలను చదివినంత పుణ్యం లభిస్తుంది. అందుకే జంధ్యం ధరించిన వాళ్లు కొన్ని నియమాలు సైతం ఆచరించాల్సి ఉంటుంది.

6/6
రాఖీ పౌర్ణమి 2024:
 రాఖీ పౌర్ణమి 2024:

ఇకపోతే పెళ్లి కాని వాళ్ళు మూడు పొగుల జంధ్యాన్ని, పెళ్లి అయిన వాళ్ళు తొమ్మిది పొగుల జంధ్యానికి మూడు ముడులు ఉంటాయి. అలాంటిదాన్ని ధరిస్తారు. శ్రావణమాసంలో వచ్చే జంధ్యాల పౌర్ణమి రోజు  ఉపనయం జరిగిన ప్రతి బ్రాహ్మణుడు జంధ్యాన్ని మార్చుకోవడం తప్పనిసరిగా చూస్తుంటాం.  





Read More