PHOTOS

Shani Nakshatra Transit: శని సంచారం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి ఊహించని ధన లాభాలు..!

Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని దేవుడి సంచారంతో గ్రహాల స్థితిగతులు మారుతూ ఉంటాయి. శని దేవుడు ఉండే రాశితోపాటు ఇతర రాశులపై ప్రభా...

Advertisement
1/8

శని సంచారంతో మిథున రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కెరీర్‌లో మార్పు ఉంటుంది. విదేశాలకు వెళ్లే యోగం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.  

2/8

తుల రాశి వారికి పూర్వీకుల నుంచి ఆస్తి లాభం కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, జీతాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. సమాజంలో మంచి పలుకుబడి ఉంటుంది.   

3/8

వృశ్చిక రాశి వ్యక్తులకు రానున్న 45 రోజులపాటు కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. ఆఫీసులలో హోదా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పరుచుకుంటారు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి అనుకూలమైన సమయం.  

4/8

శని గ్రహం మార్పుతో మకరరాశి వారికి విజయాలు అందుతాయి. పెట్టుబడులు లాభాలు తెస్తాయి. వ్యాపారాన్ని విస్తరించేందుకు మంచి అవకాశం. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. ఊహించని ధనలాభం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  

5/8

కుంభరాశి వారు పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ పనులు పూర్తి చేసుకుంటారు. ప్రమోషన్‌తోపాటు జీతాలు పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి.   

6/8

శని దేవుడి ప్రభావంతో మీన రాశి వారికి ధనం లాభం ఉంటుంది. సొంత ఇల్లు లేదా కొత్త ప్లాట్ కొనేందుకు మంచి సమయం. ఎన్నో ఏళ్లుగా ఉన్న కల నెరవేరుతుంది. కొత్త సంబంధాలు ఏర్పడతాయి.   

7/8

శని చాలీసా, హనుమాన్ చాలీసా పఠిస్తే శనిదేవుని అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. అదేవిధంగా దానధర్మాలు, పేదలకు సహాయం చేసేవారిని శని దేవుడు ఎప్పుడూ ఇబ్బంది పెట్టడని అంటారు.     

8/8

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు ఆధారంగా రాసినది. ఈ సమాచారాన్ని జీ తెలుగు మీడియా ధృవీకరించలేదు.            





Read More