PHOTOS

Nivetha Thomas: నివేదా థామస్ గుర్తుపట్టలేనంతగా మారిపోవడానికి.. అసలు కారణమేమిటంటే..?

హీరోయిన్ నివేదా థామస్ తాజాగా 35 చిన్న కథ కాదు అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కనిపించి అ...

Advertisement
1/5
నివేదా థామస్
నివేదా థామస్

హీరోయిన్లకి సినీ ఇండస్ట్రీలో లైఫ్ టైం చాలా తక్కువ అని చెప్పాలి. అయితే ఒక్కొక్కసారి అదృష్టం వరించి స్టార్డం సొంతం చేసుకొని, రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా నయనతార , త్రిష,  తమన్నా లాంటి హీరోయిన్లు ఇప్పటికీ కూడా అదే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నారు అంటే ఇక ప్రజలు వారిని ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. 

2/5
నివేదా థామస్
నివేదా థామస్

ఇకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కువగా గ్లామర్ షో చేస్తేనే అవకాశాలు వస్తాయని అందరూ అంటున్నారు. అయితే గ్లామర్ షో చేయకుండా కూడా డీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి ప్రేక్షకులలో మంచి పేరు సొంతం చేసుకున్న హీరోయిన్లు కూడా లేకపోలేదు.. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ నివేదా థామస్ కూడా ఒకరు.2016 లో  నాని హీరోగా నటించిన జెంటిల్మెన్ సినిమాలో హీరోయిన్ గా నటించి,  తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత ఎక్కువ సినిమాలు ఈమె నాని తోనే కలిసి నటించడం గమనార్హం.

3/5
నివేదా థామస్
నివేదా థామస్

 చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన  ఈమె 2008లోనే మలయాళ ఇండస్ట్రీలో నటించి మెప్పించింది.  ఇక తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి తనదైన నటనతో మెప్పించి,  పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో కూడా నటించి మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. 

4/5
నివేదా థామస్
నివేదా థామస్

ఇకపోతే షాకిని డాకిని వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించిన ఈమె తాజాగా 35  చిన్న కథ కాదు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకప్పుడు పొట్టిగా ఉన్నా సరే ఫిట్నెస్ మైంటైన్ చేసిన ఈమె ఉన్నట్టుండి బరువు పెరిగిపోయి అందరిని ఆశ్చర్యపరిచింది. అసలు ఇంత సడన్ గా  ఇంత బరువు పెరగడం ఏంటి అంటూ అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. దీనికి ప్రధాన కారణం హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ అట. ఇక ఈ విషయం తెలిసి అభిమానుల సైతం ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయమని సలహా ఇస్తున్నారు. 

5/5
నివేదా థామస్
నివేదా థామస్

ఇకపోతే స్టార్ హీరో రానా ఈ సినిమాని నిర్మించగా ప్రముఖ కమెడియన్ కం హీరో ప్రియదర్శి హీరోగా నటించారు. ఇక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతోంది.





Read More