PHOTOS

PM Kisan Mandhan Yojana: రైతులకు గుడ్ న్యూస్, ఆ పథకంలో చేరితే ఖాతాల్లోకి రూ.36,000

Advertisement
1/5
PM Kisan Mandhan Yojana Latest News: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్, అదనంగా ఏడాదికి రూ.36000
PM Kisan Mandhan Yojana Latest News: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్, అదనంగా ఏడాదికి రూ.36000

PM Kisan Mandhan Yojana Latest News | దేశానికి వెన్నెముక రైతు. అన్నదాతల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొనసాగిస్తున్న పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకంలో భాగంగా ఏడాదికి రైతులకు రూ.6 వేల చొప్పున కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ అందిస్తోంది.

Also Read: PM Kisan Scheme: రైతులు పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు పొందాలంటే కొత్త రూల్స్ ఇవే

2/5
PM Kisan Mandhan Yojana Latest News: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్, అదనంగా ఏడాదికి రూ.36000
PM Kisan Mandhan Yojana Latest News: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్, అదనంగా ఏడాదికి రూ.36000

PM Kisan Samman Nidhi | ఇప్పటివరకూ ఈ పథకంలో భాగంగా 7 దఫాలుగా రూ.2 వేలు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమచేశారు. ప్రస్తుతం 2021 ఏడాదికిగానూ తొలి దఫా నగదు విడుదల కావాల్సి ఉంది. 8వ విడత నగదు రూ.2000 మరో వారం రోజుల్లో ఏ క్షణంలోనైనా అర్హులైన లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో నేరుగా జమ కానుంది. అయితే రైతులకు ఈ రూ.6 వేలతో పాటు అదనంగా రూ.36000 అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకొచ్చింది.

3/5
PM Kisan Mandhan Yojana Latest News: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్, అదనంగా ఏడాదికి రూ.36000
PM Kisan Mandhan Yojana Latest News: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్, అదనంగా ఏడాదికి రూ.36000

రైతులకు నెలకు రూ.3 వేలు చొప్పున ప్రతి ఏడాది రూ.36,000 నగదు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది. అందుకోసం తీసుకొచ్చిన పథకం ప్రధాన్ మంత్రి కిసాన్ మన్‌ధన్ యోజన. ఇందులో భాగంగా 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు ఉన్న రైతన్నలు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాలి. 

Also Read: PM Kisan Samman Nidhi నిబంధనల్లో భారీ మార్పులు, ఇకపై వారికి రూ.6 వేలు జమ కావు

4/5
PM Kisan Mandhan Yojana Latest News: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్, అదనంగా ఏడాదికి రూ.36000
PM Kisan Mandhan Yojana Latest News: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్, అదనంగా ఏడాదికి రూ.36000

ప్రధాన్ మంత్రి కిసాన్ మన్‌ధన్ యోజనలో భాగంగా కనిష్టంగా 20 ఏళ్లు, గరిష్టంగా 40 ఏళ్లు కాలవ్యవధి వరకు నెలకు కొంత నగదు డిపాజిటివ్ చేయాలి. వారికి 60 ఏళ్లు దాటిన తరువాత ప్రతినెలా రూ.3000 చొప్పున పింఛన్ అందిస్తారు. 18 ఏళ్ల వయసు వారు నెలకు రూ.55, 30 ఏళ్ల రైతులు నెలకు రూ.110, 40 ఏళ్ల వయసు వారు నెలకు రూ.200 మేర చెల్లించాల్సి ఉంటుంది. 

Also Read: PM Kisan Samman Nidhi: రైతులకు గుడ్ న్యూస్, త్వరలో బ్యాంక్ ఖాతాలో రూ.2000 జమ

5/5
PM Kisan Mandhan Yojana Latest News: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్, అదనంగా ఏడాదికి రూ.36000
PM Kisan Mandhan Yojana Latest News: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్, అదనంగా ఏడాదికి రూ.36000

రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఏడాదికి రూ.6 వేలు, పింఛన్ లబ్దిదారులైతే రూ.36 వేలు మొత్తంగా రైతన్నలు ఏడాదికి రూ.42,000 అందుకోనున్నారు. అయితే పీఎం కిసాన్ మన్‌ధన్ యోజన పింఛన్ పొందాలనుకునే రైతులు కచ్చితంగా 2 హెక్టార్ల వ్యవసాయ భూమిని సాగు చేయాల్సి ఉంటుంది. వారి నుంచి మాత్రమే నెలానెలా డబ్బును డిపాజిట్ చేయించుకుని పింఛన్‌కు అర్హులుగా పరిగణిస్తారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More