PHOTOS

Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డుపై సరిగ్గా లేని ఫోటో మార్చుకోవడం ఎలా ?

ఆధార్ కార్డుపై ఫోటో మార్చుకునే అవకాశం ఉందనే విషయం చాలామందికి తెలియదు. ఒకవేళ మీ ఆధార్ కార్డు ఫోటో మార్చుకోవాలని అనుకుంటే.. మీకు సమీపంలో ...

Advertisement
1/9
Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డ్ ఫోటో మార్చుకోవడం ఎలా అంటే.. 
Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డ్ ఫోటో మార్చుకోవడం ఎలా అంటే.. 

ఆధార్ కార్డ్ ఫోటో మార్చుకోవడం ఎలా అంటే..  ఆధార్ కార్డుపై ఫోటోగ్రాఫ్ అప్‌డేట్ చేసుకోవడానికి ముందుగా మీరు మీకు సమీపంలో ఉన్న ఆధార్ శాశ్వత నమోదు కేంద్రం విజిట్ చేయాల్సి ఉంటుంది.

2/9
Photo Change On Aadhaar Card: ఆధార్ నమోదు ఫారంలో డీటేల్స్
Photo Change On Aadhaar Card: ఆధార్ నమోదు ఫారంలో డీటేల్స్

ఆధార్ నమోదు ఫారంలో వివరాలు నింపి, ఫారంను ఆధార్ నమోదు కేంద్రంలో అందించి బయోమెట్రిక్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆధార్ కేంద్రంలో ఉన్న సిబ్బంది డిజిటల్ కెమెరా ద్వారా మీ ఫోటో తీసుకుంటారు.

3/9
Photo Change On Aadhaar Card: బయోమెట్రిక్ వివరాల అప్‌డేట్ చేయడానికి సర్వీస్ ఛార్జ్
Photo Change On Aadhaar Card: బయోమెట్రిక్ వివరాల అప్‌డేట్ చేయడానికి సర్వీస్ ఛార్జ్

బయోమెట్రిక్ వివరాల సబ్మిట్ చేసి మీ అప్లికేషన్‌ని ధృవీకరించాల్సి ఉంటుంది. ఆధార్‌లోని బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడానికి రూ.100 సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.

4/9
Photo Change On Aadhaar Card: URN నెంబర్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి
Photo Change On Aadhaar Card: URN నెంబర్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి

ఫీజు చెల్లించడంతో అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)తో రసీదు ఇస్తారు.  మీరు URN నెంబర్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయవచ్చు.

5/9
Photo Change On Aadhaar Card: ఫోటో అప్‌డేట్ అయిన తర్వాత అప్‌డేటెడ్ ఆధార్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
Photo Change On Aadhaar Card: ఫోటో అప్‌డేట్ అయిన తర్వాత అప్‌డేటెడ్ ఆధార్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి

ఫోటో అప్‌డేట్ అయిన తర్వాత అప్‌డేటెడ్ ఆధార్ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్ 1: ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌లో  https://uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html ఈ పేజీని సందర్శించండి.  

6/9
Photo Change On Aadhaar Card: ఆధార్ ఫోటో మార్పు
Photo Change On Aadhaar Card: ఆధార్ ఫోటో మార్పు

స్టెప్ 2: 'డౌన్‌లోడ్ ఆధార్'పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: ఆధార్ నంబర్, రిజిస్టర్ ఐడి లేదా వర్చువల్ ఐడిని నమోదు చేయండి.

7/9
Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డు అప్‌డేట్
Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డు అప్‌డేట్

స్టెప్ 4: కింద ఇచ్చిన క్యాప్చాను ఎంటర్ చేసి, ఓటిపి సెండ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 5: ఆ తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటిపిని నమోదు చేయండి.

8/9
Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి...
Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి...

స్టెప్ 6: ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి ఆ తరువాతి పేజీలో ఉన్న స్టెప్స్‌ని అనుసరించండి. మీకు ఇక్కడే ఆధార్‌ కార్డును ప్రింట్ చేసే అవకాశం కూడా ఉంటుంది.

9/9
Photo Change On Aadhaar Card: ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌లో ఫోటోను అప్‌డేట్ చేయడానికి వీల్లేదు
Photo Change On Aadhaar Card: ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌లో ఫోటోను అప్‌డేట్ చేయడానికి వీల్లేదు

ఆధార్ నమోదు కేంద్రం వద్ద తప్పించి నేరుగా మీకు మీరుగా ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌లో ఫోటోను అప్‌డేట్ చేయడానికి వీల్లేదు.





Read More