PHOTOS

Pension Scheme: రిటైర్మంట్ తర్వాత నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలా..అయితే ఈ స్కీం మీ కోసం..ఏం చేయాలో తెలుసుకుందాం

Mutual Fund Plan: మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం ద్వారా ప్రతి నెల రూ. 10 వేలు సంపాదించవచ్చు అంటే నమ్మలేకపోతున్నారా..అ...

Advertisement
1/6
పదవీ విరమణ పెన్షన్ పథకం:
పదవీ విరమణ పెన్షన్ పథకం:

Retirement Pension Scheme: ప్రతి వ్యక్తి తన రిటైర్మెంట్ తర్వాత జీవితం ఎలా గడపాలి అని ఆందోళన  చెందడం చూస్తుంటాం. కానీ రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఉన్నట్లయితే, తమ జీవితం ఆర్థికంగా స్థిరంగా ఉంటుందని ప్రతి ఒక్కరు ఆశిస్తుంటారు. ముఖ్యంగా ప్రతినెల స్థిరంగా ఆదాయం ఉన్నట్లయితే, ముసలితనంలో వయసు మీరిన తర్వాత మీరు ఎలాంటి పనులు చేయలేని సమయంలో మీకు ప్రతి నెల వచ్చే పెన్షన్ ఆధారం అవుతుంది.

2/6
మ్యూచువల్ ఫండ్స్
 మ్యూచువల్ ఫండ్స్

అయితే మీకు ప్రతినెలా పెన్షన్ కావాలంటే, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచి మార్గం అని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు రెండు పద్ధతుల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మొదటిది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) రెండవది లంప్సం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇందులో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే, ప్రతినెలా కొద్ది మొత్తంలో మీరు డబ్బును మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఉదాహరణకు మీరు నెలకు 500 రూపాయల నుంచి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం మీకు లభిస్తుంది.  

3/6
లాంగ్ టర్మ్ లో మంచి ఆదాయం
లాంగ్ టర్మ్ లో మంచి ఆదాయం

 తద్వారా మీరు లాంగ్ టర్మ్ లో మంచి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది. దీంతో పాటు మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ కూడా ఉంటుంది. దీని ద్వారా సుదీర్ఘ కాలం పాటు మదుపు చేసిన అనంతరం నెల పెన్షన్ రూపంలో డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. పలు మ్యూచువల్ ఫండ్స్ హౌసులు ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాయి.

4/6
ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రీడమ్ సిప్
ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రీడమ్ సిప్

తాజాగా ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రీడమ్ సిప్ పేరుతో ఇలాంటి సిస్టమాటిక్ విత్ రాయల్ ఫర్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసేందుకు, ఒక నిర్దిష్ట కాలవ్యవధిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఎనిమిది సంవత్సరాలు 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు రూపంలో మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.   

5/6
సిస్టమాటిక్ విత్ ఆయిల్ ప్లాన్
సిస్టమాటిక్ విత్ ఆయిల్ ప్లాన్

ఈ టెన్యూర్ లోనే మీరు డబ్బులు మదుపు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫ్రీడం సిప్ పథకం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇది కేవలం కార్పస్ ఫండ్ మాత్రమే కాదు. ఇందులో సిస్టమాటిక్ విత్ ఆయిల్ ప్లాన్ కూడా అందుబాటులో ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇందులో మీరు మీ సిప్ టెన్యూర్ పూర్తి అయిన అనంతరం విత్ డ్రా చేసుకుంటే సరిపోదు, మీ అవసరాలకు తగ్గట్టుగా ప్రతినెలా కొంచెం కొంచెం విత్ డ్రా చేసుకోవడం ద్వారా మీకు ప్రతి నెల పెన్షన్ లభిస్తుంది.  

6/6
ఐసిఐసిఐ బ్యాంక్
ఐసిఐసిఐ బ్యాంక్

ప్రస్తుతం ఐసిఐసిఐ బ్యాంక్ అందుబాటులోకి తెచ్చిన ఈ పెన్షన్ స్కీం ప్రకారం మీకు నెలకి పదివేల రూపాయల పెన్షన్ కావాలంటే 8 సంవత్సరాల పాటు ప్రతి నెల రూ.10000 సిప్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు 30 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ లో కొనసాగినట్లయితే, మీకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.  





Read More