PHOTOS

New Rules: అక్టోబర్ 1 నుంచి పీపీఎఫ్ రూల్స్‎లో మార్పులు.. ఇన్వెస్టర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

8px;">PPF New Rules: ఇదివరకే అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్లు...ఇప్పుడు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నవాళ్లు ఈ అప్ డేట్...

Advertisement
1/7
అక్టోబర్ 1 నుంచి పీపీఎఫ్ రూల్స్ లో మార్పులు
అక్టోబర్ 1 నుంచి పీపీఎఫ్ రూల్స్  లో మార్పులు

New PPF Rules from 1 October 2024: ఇప్పటికే అకౌంట్ తీసుకున్నవాళ్లు.. తీసుకోవాలనుకుంటున్నవాళ్లు కొన్నిరూల్స్ తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కరూ.. ఎంపిక  చేసుకునే పథకాల్లో మంచి  రిటర్స్న్ రావాలని భావిస్తారు. అలాగే సేఫ్టీ, ఫిక్స్డ్ ఇన్ కమ్ కు చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఈ ఆప్షన్స్ అన్నీ కవర్ చేస్తూ పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుండటంతో ఎక్కుమంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.  అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం పీపీఎఫ్ ఖాతాకు సంబంధించిన నిబంధనలలో మార్పులు చేసింది. ఆ మార్పులు ఏంటో పూర్తి వివరాలు చూద్దాం. 

2/7
భవిష్యత్తు కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
భవిష్యత్తు కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్

మెరుగైన భవిష్యత్తు కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్  (PPF)మంచి పెట్టుబడి సాధనంగా భావిస్తారు. ఈ పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ లో పెట్టుబడి పెడితే భద్రతో పాటు సేఫ్టీ ఇన్ కమ్ ఉంటుందని భావిస్తుంటారు. ఈ మధ్యే పీపీఎఫ్ అకౌంట్ కు సంబంధించి కొన్ని రూల్స్ మార్చరు.కొత్త మార్గదర్శకాలలో, జాతీయ చిన్న పొదుపు పథకం కింద పోస్టాఫీసుల ద్వారా ఎన్‌ఆర్‌ఐల కోసం మైనర్‌ల పేరుతో తెరిచిన అనేక పిపిఎఫ్ ఖాతాలు,  పిపిఎఫ్ ఖాతాల పొడిగింపుకు సంబంధించిన రూల్స్ మార్చురు.   

3/7
ఈ నిబంధనలలో చేసిన మార్పులు ఇవే: 
ఈ నిబంధనలలో చేసిన మార్పులు ఇవే: 

ఈ నిబంధనలలో చేసిన మార్పులు ఇవే:  పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతాలను కలిగి ఉన్న నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIలు)ను ప్రభావితం చేసే కొత్త మార్గదర్శకాలను ఆర్థిక వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ కొత్త రూల్స్ అక్టోబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తాయి.  ఈ మార్పులు నివాస వివరాలు లేకుండా తెరిచిన PPF ఖాతాలపై వడ్డీని పొందే విధానాన్ని ప్రభావితం చేస్తాయి.

4/7
NRIల కోసం ప్రస్తుత నియమాలు:
NRIల కోసం ప్రస్తుత నియమాలు:

NRIల కోసం ప్రస్తుత నియమాలు: ప్రస్తుతం, నివాస వివరాలు అవసరం లేని PPF ఖాతాలను కలిగి ఉన్న NRIలు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా (POSA) రేటుపై వడ్డీని పొందడం కొనసాగిస్తున్నారు. ఈ వడ్డీ రేటు సెప్టెంబర్ 30, 2024 వరకు వర్తిస్తుంది. అయితే, ఈ తేదీ తర్వాత, ఈ ఖాతాలపై వడ్డీ 0 శాతం అవుతుంది.

5/7
కొత్త రూల్ ఏమిటి?
కొత్త రూల్ ఏమిటి?

కొత్త రూల్ ఏమిటి? పోస్టాఫీసుల ద్వారా నేషనల్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ (ఎన్‌ఎస్‌ఎస్) కింద పొదుపు ఖాతాలను తెరవడంలో అవకతవకలను తొలగించేందుకు ఆర్థిక వ్యవహారాల శాఖ ఈ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ గైడ్‌లైన్స్  ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. ఈ అకౌంట్స్ మొదట్లో ఎలా సెటప్ చేశారన్న దానిపై..దానిలో ఉన్న వ్యత్యాసాలను క్రమబద్దీకరించడంతోపాటు వాటిని సరిచేస్తుంటారు.   

6/7
PPF ఖాతాలను కలిగి ఉన్న యాక్టివ్ NRIలకు సెప్టెంబర్ 30 తర్వాత వడ్డీ అందుబాటులో ఉండదు:
PPF ఖాతాలను కలిగి ఉన్న యాక్టివ్ NRIలకు సెప్టెంబర్ 30 తర్వాత వడ్డీ అందుబాటులో ఉండదు:

PPF ఖాతాలను కలిగి ఉన్న యాక్టివ్ NRIలకు సెప్టెంబర్ 30 తర్వాత వడ్డీ అందుబాటులో ఉండదు: మరీ ముఖ్యంగా ఈ నివాస అవసరాలకు అనుగుణంగా లేని PPF ఖాతాలపై వడ్డీ రేటు అక్టోబర్ 1, 2024 నుండి 0 శాతానికి తగ్గుతుంది. ఒకటి కంటే ఎక్కువ PPF ఖాతాలు ఉంటే, పథకం వడ్డీ రేటు ప్రకారం డబ్బు మొదటి ఖాతాలోకి వస్తూనే ఉంటుంది. రెండవ ఖాతాలో ఉన్న డబ్బు మొదటి ఖాతాకు బదిలీ అవుతుంది.  ఇది కాకుండా మీరు మొదటి , రెండవ ఖాతాలు  మినహా మరే ఇతర ఖాతాలపై వడ్డీని పొందలేరు. NRI PPF ఖాతాలో కూడా, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాతో సమానమైన వడ్డీ సెప్టెంబర్ 30 వరకు అందిస్తారు. ఆ తర్వాత వడ్డీ లభించదు.  

7/7
మైనర్‌కు పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా
మైనర్‌కు పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా

కాగా మైనర్‌కు పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాకు సమానమైన వడ్డీ లభిస్తుంది.  ఖాతా  మెచ్యూరిటీ వ్యవధి తర్వాత  మైనర్‌కు 18 సంవత్సరాలు నిండిన తేదీ నుండి పరిగణలోనికి తీసుకుంటారు. 





Read More