PHOTOS

Mr Bachchan Vs Double Ismart: ఒకే రూట్లో రవితేజ, రామ్ పోతినేని.. మరోసారి ఆ ఇద్దరు దర్శకులనే నమ్ముకున్న హీరోలు..

Ismart:  సినీ ఇండస్ట్రీలో ఒక హీరో, దర్శకుడు  కాంబినేషన్‌లో సినిమా సక్సెస్ అయితే  ఆ కాంబోలో వచ్చే సినిమా కోసం అభ...

Advertisement
1/6
రవితేజ - హరీష్ శంకర్ (మిస్టర్ బచ్చన్)
రవితేజ - హరీష్ శంకర్ (మిస్టర్ బచ్చన్)

రవితేజ - హరీష్ శంకర్ (మిస్టర్ బచ్చన్): రవితేజ, హరీష్ శంకర్  కలయికలో గతంలో షాక్, మిరపకాయ్ వంటి సినిమాలొచ్చాయి. అందులో షాక్ నిజంగానే షాక్ ఇస్తే.. మిరపకాయ్ సినిమా మాత్రం సక్సెస్ అయింది. తాజాగా ఇపుడు వీళ్ల కాంబినేషన్‌లో 'మిస్టర్ బచ్చన్'సినిమా రాబోతుంది. మరి ఈ సినిమాతో రవితేజకు హరీష్ శంకర్ హిట్ అందిస్తాడా లేదా అనేది చూడాలి.

2/6
రామ్ పోతినేని - పూరీ జగన్నాథ్ (డబుల్ ఇస్మార్ట్)
రామ్ పోతినేని - పూరీ జగన్నాథ్ (డబుల్ ఇస్మార్ట్)

రామ్ పోతినేని - పూరీ జగన్నాథ్ (డబుల్ ఇస్మార్ట్): ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ హిట్ తర్వాత రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కలయికలో ఇపుడు 'డబుల్ ఇస్మార్ట్' సినిమా మరికొన్ని గంటల్లో రాబోతుంది. ఈ సినిమాపై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. 

3/6
ఎన్టీఆర్ - కొరటాల శివ (దేవర పార్ట్ -1)
ఎన్టీఆర్ - కొరటాల శివ (దేవర పార్ట్ -1)

ఎన్టీఆర్ - కొరటాల శివ (దేవర పార్ట్ -1): ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో గతంలో 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి దేవర సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత ‘దేవర 2’ విడుదల కాబోతుంది.  

 

4/6
బాలకృష్ణ - బోయపాటి శ్రీను (అఖండ 2)
బాలకృష్ణ - బోయపాటి శ్రీను (అఖండ 2)

బాలకృష్ణ - బోయపాటి శ్రీను (అఖండ 2): ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో సింహా, లెజెండ్, అఖండ వంటి హాట్రిక్ హిట్స్ ఉన్నాయి. ఇపుడు వీళ్ల కలయికలో అఖండ 2 రాబోతుంది. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

5/6
ప్రభాస్ - ప్రశాంత్ నీల్.. (సలార్ పార్ట్ 2 శౌర్యంగా పర్వం)
ప్రభాస్ - ప్రశాంత్ నీల్.. (సలార్  పార్ట్ 2 శౌర్యంగా పర్వం)

ప్రభాస్ - ప్రశాంత్ నీల్.. (సలార్  పార్ట్ 2 శౌర్యంగా పర్వం): ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన 'సలార్ సీజ్ ఫైర్ పార్ట్ -1' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇపుడు వీళ్ల కాంబినేషన్ లో రాబోతున్న  'సలార్ - 2 శౌర్యంగ పర్వం' రాబోతుంది. 

6/6
అల్లు అర్జున్ - త్రివిక్రమ్
అల్లు అర్జున్ - త్రివిక్రమ్

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ (AA -TS4):

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలతో హిట్రిక్ హిట్స్ నమోదు చేసారు. త్వరలో వీళ్ల కలయికలో నాల్గో సినిమా ప్రకటించారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.





Read More