PHOTOS

White Hair Home Remedies: వంటింట్లో దొరికే ఈ వస్తువులను Hennaలో కలిపి తలకు పెడితే తెల్లవెంట్రుక రమ్మన్నారాదు

ి,తప్పుడు  ఆహారం, పెరుగుతున్న కాలుష్యం కారణంగా జుట్టు నెరవడం అనేది సాధారణ సమస్యగా మారింది. జుట్టు సాధారణంగా వయస్సు పెరిగినా కొద్దీ...

Advertisement
1/6
తెల్ల జుట్టుకు నేచురల్ రెమెడీ:
తెల్ల జుట్టుకు నేచురల్ రెమెడీ:

Natural Remedy For White Hair:నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఇతర కారణాల వల్ల చిన్న వయస్సులోనే చాలా మందికి తెల్లజుట్టు వస్తుంది. తెల్లజుట్టును నల్లగా మార్చుకునేందుకు మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్టులను వాతున్నారు. వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇంట్లో వంటగదిలో దొరికే ఈ వస్తువులను హెన్నాలో కలిపి తలకు రాసుకుంటున్నట్లయితే  తెల్లజుట్టు సమస్య దాదాపు పరిష్కారం అవుతుంది. ఆ వస్తువులు ఏంటో చూద్దాం. 

2/6
నల్ల నువ్వులు:
నల్ల నువ్వులు:

నల్ల నువ్వులు: నల్ల నువ్వులను పొడి చేసుకుని..హెన్నాలో కలపాలి. ఇందులో కొన్ని నీళ్లు, చెంచా టీ పొడి పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం  చేయాలి. ఇలా తరచుగా చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. 

3/6
టీ ఆకులు:
టీ ఆకులు:

టీ ఆకులు: జుట్టు సహజంగా నల్లగా మారాలంటే ముందుగా పాన్‌లో ఒక గ్లాసు నీళ్లు పోసి, టీ ఆకులను సమంగా కలిపి బాగా మరిగించాలి. తర్వాత అందులో నాలుగైదు చెంచాల మెహందీ కలపాలి.ఈ మిశ్రమాన్ని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే జుట్టుకు పట్టించి..ఒక గంట పాటు అలాగే ఉంచాలి. గంట తర్వాత తేలికపాటి షాంపూని ఉపయోగించి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.   

4/6
అలోవెరా జెల్:
అలోవెరా జెల్:

అలోవెరా జెల్: అలోవెరా జెల్ వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా ఒత్తుగా, మృదువుగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది.  

5/6
కొబ్బరినూనె:
కొబ్బరినూనె:

కొబ్బరినూనె: జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కొబ్బరి నూనె ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి రాసుకుంటే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. నిమ్మకాయ జుట్టుకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. నిమ్మ పండును ఇలా వాడితే జుట్టు నల్లగా మారడంతో పాటు చుండ్రు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. నిమ్మకాయలో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇది జుట్టు నల్లగా, సిల్కీగా పెరగడానికి సహాయపడుతుంది.    

6/6
గమనిక :
గమనిక :

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.  





Read More