PHOTOS

Maha Shivaratri 2024 Remedies: మహాశివరాత్రి రోజు వీటిని దానం చేస్తే కఠిక పేదలు కూడా ధనవంతులవుతారు!

Maha Shivaratri 2024: ప్రతి సంవత్సరం భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో మహాశివరాత్రి ఒకటి. ఈ శివరాత్రి రోజు శివాలయాలని భక్తులతో క...

Advertisement
1/6
Maha Shivaratri 2024 Remedies
Maha Shivaratri 2024 Remedies

శివుడికి ఎంతో ఇష్టమైన జంతువు ఆవుకు మహాశివరాత్రి రోజున గోధుమ పిండితో తయారుచేసిన రొట్టెలను మీదగా తినిపించడం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలైనా సులభంగా దూరమవుతాయని పురాణాల్లో తెలిపారు. అంతేకాకుండా తరచుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారికి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందట.  

2/6
Maha Shivaratri 2024 Remedies
Maha Shivaratri 2024 Remedies

మహాశివరాత్రి రోజున పాలను దానం చేయడం కూడా చాలా శుభ్రమని పూర్వికులు చెబుతున్నారు. శివుడికి పాలు అంటే ఎంతో ఇష్టం.. కాబట్టి శివ పూజ అనంతరం పేదవారికి పాలను దానం చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే శివుడి అనుగ్రహం కూడా లభిస్తుందట.  

3/6
Maha Shivaratri 2024 Remedies
Maha Shivaratri 2024 Remedies

మహాశివరాత్రి రోజు ఆవుపాలతో తయారుచేసిన నైవేద్యాన్ని శివుడికి సమర్పించి నలుగురు పేదవారికి దీనిని దానం చేయడం వల్ల చిరకాల కోరికలు నెరవేరుతాయి. అలాగే తల్లి పార్వతి అనుగ్రహం కూడా లభించి అదృష్టవంతులవుతారు.  

4/6
Maha Shivaratri 2024 Remedies
Maha Shivaratri 2024 Remedies

మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఖీర్ నైవేద్యాన్ని కూడా మహాశివరాత్రి రోజు దానం చేయవచ్చు. శివరాత్రి రోజు శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ నైవేద్యాన్ని దానం చేయడం ఎంతో శుభప్రదమని పురాణాల్లో తెలిపారు.

5/6
Maha Shivaratri 2024 Remedies
Maha Shivaratri 2024 Remedies

అలాగే మహాశివరాత్రి రోజున శని దేవుడికి ఎంతో ఇష్టమైన నల్ల నువ్వులను కూడా దానం చేయడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈరోజు నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని దుష్ప్రభావాలనుంచి సులభంగా విముక్తి లభిస్తుంది అంతేకాకుండా కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని భక్తుల నమ్మకం.  

6/6
Maha Shivaratri 2024 Remedies
Maha Shivaratri 2024 Remedies

మహాశివరాత్రి రోజు భక్తిశ్రద్ధలతో శివుడికి ప్రత్యేక పూజలు చేసి కొత్త బట్టలను నలుగురు పేదవారికి దానం చేయడం ఎంతో శుభప్రదం. ఇలా దానం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ సులభంగా పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా సంపద కూడా పెరుగుతుందని భక్తుల నమ్మకం.  





Read More