PHOTOS

Lok Sabha 2024 Elections: 2024 లోక్‌ సభకు బీజేపీ తరుపున పోటీ చేస్తోన్న సినిమా హీరోలు వీళ్లే..

వ్యాప్తంగా ఏప్రిల్ 19న తొలి విడత ఎన్నికలతో సార్వత్రిక సమరం ప్రారంభం కానుంది. ఆ తర్వాత జూన్ 1న జరిగే ఏడో విడత ఎన్నికలతో దేశంలోని 543 ఎంప...

Advertisement
1/5
సురేష్ గోపీ ..
సురేష్ గోపీ ..

సురేష్ గోపీ .. (Suresh Gopi) మలయాళం సీనియర్ స్టార్ హీరో సురేష్ గోపీ.. బీజేపీ తరుపున త్రిశూర్ నుంచి ఎంపీగా రెండోసారి బరిలో దిగుతున్నారు. తొలిసారి ఓటమిని చవి చూసిన ఈ స్టార్ యాక్టర్ ఈ సారి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెడతారా లేదా అనేది చూడాలి.

2/5
అరుణ్ గోవిల్.. (టీవీ రాముడు)
అరుణ్ గోవిల్.. (టీవీ రాముడు)

అరుణ్ గోవిల్.. (టీవీ రాముడు)  (Arun Govil) టెలివిజన్ తెరపై తొలి బ్లాక్ బస్టర్ సీరియల్ రామాయణం సీరియల్‌లో శ్రీరాముడి పాత్రలో అలరించిన నటుడు అరుణ్ గోవిల్. అందులో ఈయన నటనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు్నారు.  ఈ సారి ఈయన బీజేపీ తరుపున ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ నుంచి పోటీ చేస్తున్నారు.

3/5
రవికిషన్ శుక్లా
రవికిషన్ శుక్లా

రవికిషన్ శుక్లా ( Ravi Kishan Shukla): అల్లు అర్జున్ 'రేసు గుర్రం' మూవీలో మద్దాలి శివారెడ్డి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన రవి కిషన్ శుక్లా. భోజ్‌పురి సినీ ఇండస్ట్రీలో టాప్ స్టార్. ఈయన గత ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నో ఏళ్లుగా ఎంపీగా బాధ్యతలు నిర్వహించిన గోరఖ్ పూర్ నుంచి రెండోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు.

4/5
మనోజ్ తివారి
మనోజ్ తివారి

మనోజ్ తివారి (Manoj Tiwari); భోజ్‌పురి టాప్ స్టార్ మనోజ్ తివారి గత రెండు పర్యాయాలు ఢిల్లీ నార్త్ ఈస్ట్ నుంచి ఎంపీగా గెలుస్తూ వచ్చారు. ఈ సారి కూడా ఈయన అదే స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు.

5/5
దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా
దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా

దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా (Nirahua):

భోజ్‌పురి నటుడు అయిన దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిరుహువా.. ఈ  సారి ఈయన ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌ లోక్ సభ నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్నారు. 2019 లోక్‌ సబ ఎన్నికల్లో యూపీ ఎక్స్ సీఎం అఖిలేష్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు.  ఆ తర్వాత 2022 ఉప ఎన్నికల సమయంలో అంజగఢ్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇపుడు మరోసారి అదే స్థానం నుంచి బీజేపీ ఎంపీ టికెట్ కేటాయించింది.





Read More