PHOTOS

Karnataka Elections 2023: ఓటర్లను ఆకర్షించేందుకు సూపర్ ఐడియా.. స్పెషల్ అట్రాక్షన్‌గా పోలింగ్ కేంద్రాలు

ataka: కర్ణాటక ఎన్నికల పోలింగ్ సమయం ముంచుకువస్తోంది. మే 10న ఓటింగ్ జరగనుండగా.. మే 13న కౌంటింగ్ జరగనుంది. ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగ...

Advertisement
1/4

యలబుర్గా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు వివిధ రకాల మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఓటింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు.. ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు ఇక్కడ గోడలపై నినదాలు రాశారు.  

2/4

యలబుర్గా పట్టణంలో ప్రత్యేక పోలింగ్ బూత్‌ను కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా ముధోల, తుమ్మరగుడ్డిలోని మోడల్ పోలింగ్ బూత్‌లకు పూర్తి వర్లీ కళతో రంగులు వేసి ఆకర్షణీయమైన చిత్రాలను గీశారు.   

3/4

యలబుర్గా పట్టణంలోని పట్టణ పంచాయతీ, ప్రభుత్వ మోడల్‌ పాఠశాలను పింక్‌ పోలింగ్‌ బూత్‌గా నిర్మించి రంగులతో సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా మహిళలు ఇక్కడికి వచ్చి ఓటేయనున్న నేపథ్యంలో వారికి ఈసారి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.  

4/4

బేవూరు ప్రభుత్వ తరహా ప్రాథమిక పాఠశాల చిత్రాలు ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పింక్‌ పోలింగ్‌ కేంద్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా నిర్మించిన పింక్‌ పోలింగ్‌ కేంద్రం ఆకట్టుకుంటోంది.   





Read More