PHOTOS

kangana ranaut: లేడీ కానిస్టేబుల్ కు గోల్డ్ రింగ్, జాబ్ ఆఫర్.. కంగానా రనౌత్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్..

ెంపదెబ్బ ఘటన చిలికి చిలికి గాలివానలా మారుతుంది. ఈ క్రమంలో ఛండీఘడ్ ఎయిర్ పోర్టులో నటి కంగానాను సీఎఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్...

Advertisement
1/6
కంగానా రనౌత్:
 కంగానా రనౌత్:

దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన వేళ.. కంగానా రనౌత్ వివాదం క్రమంగా ముదురుతుంది. బీజేపీ ఫైర్ బ్రాండ్ మండి ఎంపీ అభ్యర్థి ఢిల్లీకి వెళ్లేందుకు ఛండీగఢ్ విమానశ్రయం చేరుకున్నారు. ఈ క్రమంలో కంగానాకు షాకింగ్ అనుభవం ఎదురైంది.

2/6
కంగానా రనౌత్:
 కంగానా రనౌత్:

కంగానాను సీఐఎస్ఎఫ్ లేడీ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ చెంపమీద కొట్టింది. గతంలో కంగానా ఢిల్లీలోని రైతు ఉద్యమంలో వంద, రెండోందులు తీసుకుని రైతులు నిరసనలు చేస్తున్నారని, ఖలీస్తాన్ తీవ్రవాదులున్నారంటూ వ్యాఖ్యలు చేసింది.

3/6
కంగానా రనౌత్:
 కంగానా రనౌత్:

అప్పుడు సదరు లేడీ కానిస్టేబుల్ తల్లి, అక్కడ ఉద్యమంలో ఉందని, తమ మనోభావాలు దెబ్బతినడం వల్లనే దాడిచేశానని కుల్వీందర్ కౌర్ చెప్పింది. ఈ ఘటనపై హర్యానా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సీఐఎస్ఎఫ్ ను విధుల నుంచి సస్పెండ్ చేసి, అరెస్ట్ చేశారు.

4/6
కంగానా రనౌత్:
 కంగానా రనౌత్:

కంగానా ఘటనపై బాలీవుడ్ నుంచి కానీ, పొలిటిషియన్స్ నుంచి గానీ తగినంత స్పందన రాలేదు. దీంతో ఆమె మరింత ఫైర్ అయ్యారు. మీకు కూడా భవిష్యత్తులో ఇలాంటి అనుభవం మీకు కూడా కల్గవచ్చంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక కంగానా దాడి చేసిన లేడీ కానిస్టేబుల్ కు రైతులు, సోషల్ మీడియా వేదికగా అనేక మంది మద్దతు తెలియజేస్తున్నారు.

5/6
కంగానా రనౌత్:
 కంగానా రనౌత్:

ఫెమస్ సింగర్ విశాల్ దద్లానీ ఆమెకు జాబ్ ఆఫర్ చేశారు. తమిళనాడుకు చెందిన పెరియార్ అభిమాన సంఘం.. ఆమెకు బంగారు ఉంగరం బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. కోయంబత్తూరులోని తంథై పెరియార్ ద్రావిడర్ కజగం 8 గ్రాముల బంగారు ఉంగరం కానుకగా పంపుతామని  ప్రకటించింది.

6/6
కంగానా రనౌత్:
 కంగానా రనౌత్:

ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపించాని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు లేడీకానిస్టేబుల్ పట్ట ప్రజల్లో మద్దతు పెరుగుతుంది. ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోసారి తెరపైకి రైతుల ఉద్యమం చర్చకు వచ్చింది.





Read More