PHOTOS

Kalki Record: నైజాం గడ్డపై ‘కల్కి’ మూవీ మరో రికార్డు.. ఇది రెబల్ స్టార్ ప్రభాస్ మాస్ రాపేంజ్..

్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీ విడుదలైన రోజు నుంచి రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఓవర్సీస్ తో పాటు త...

Advertisement
1/7
కల్కి మూవీ ప్రభంజనం
కల్కి మూవీ ప్రభంజనం

ఏ సమయంలో‘కల్కి’ మూవీ రిలీజైందో విడుదలైన దాదాపు అన్ని ఏరియాల్లో ప్రభంజనం క్రియేట్ చేస్తుంది.  కల్కి మేనియా తెలుగు చిత్ర సీమకే పరిమితం కాలేదు. హిందీ బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా అప్రతిహతంగా దూసుకుపోతుంది. ఇప్పటికే మన దేశంలో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 275 కోట్ల నెట్ వసూళ్లతో మంచి ఊపు మీదుంది. 

2/7
కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్
కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్

తెలుగు చిత్రసీమకు నైజం ఏరియా అత్యంత కీలకమైనది. ఈ ఏరియాలో ప్రభాస్ నటించిన ‘కల్కి’ మూవీ రూ. 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్ గా 27 రోజుల్లో ఈ సినిమా ఇక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది.

 

3/7
బాక్సాఫీస్ దగ్గర కల్కి దూకుడు
బాక్సాఫీస్ దగ్గర కల్కి దూకుడు

మొత్తం అన్ సీజన్ లో అది కూడా ఎలాంటి  హాలీడేస్ లేకుండా విడుదలైన ‘కల్కి 2898 AD’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దులుపుతోంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సినిమా రూ. 168 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

4/7
తెలంగాణ కలెక్షన్స్
తెలంగాణ కలెక్షన్స్

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 185 కోట్లకు పైగా షేర్ అందుకొని ఎక్స్ లెంట్ హోల్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు ఒక్క తెలంగాణ (నైజాం) ఏరియాలో ఈ సినిమా మంచి హోల్డ్ తో లాంగ్ రన్ రాబట్టింది.

5/7
కల్కి యూఎస్ కలెక్షన్స్
కల్కి యూఎస్ కలెక్షన్స్

మరోవైపు ఈ సినిమా $ 19 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఓవరాల్ ఈ సినిమా మన కరెన్సీలో రూ. 140 కోట్ల షేర్ (రూ. 222 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. అంతేకాదు బాహుబలి 2 తర్వాత ఓవర్సీస్ లో అత్యధిక వసూల్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.

6/7
కల్కి తెలంగాణ కలెక్షన్స్
కల్కి తెలంగాణ కలెక్షన్స్

తెలంగాణలో ఈ సినిమా రూ. 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కు గాను  రూ. 90 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా నైజాం గడ్డపై ఈ సినిమా రూ. 25 కోట్ల లాభాలను రాబట్టింది.

7/7
కల్కి కలెక్షన్స్
కల్కి కలెక్షన్స్

ఓవరాల్ గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1150 కోట్ల గ్రాస్ (రూ. 555 కోట్ల షేర్) రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా థియేట్రికల్ గా ఈ సినిమా రూ. 151 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా తెలంగాణ సహా మిగిలిన ఏరియాల్లో రాబోయే రోజుల్లో ఈ సినిమా  ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.





Read More