PHOTOS

Train Ticket: పండక్కి ఊరేళుతున్నారా..? సింపుల్‌గా రైల్వే టికెట్‌ ఇలా బుక్‌ చేసుకోండి..!

రాత్రి ఉత్సవాల సందర్భంగా చాలా మంది సొంతళ్లకు పయనం అవుతున్నారు. ఇప్పటికే చాలా వరకు ట్రైన్, బస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. పండుగల సీజన్ ...

Advertisement
1/5

పండుగ సీజన్‌ వచ్చిందంటే చాలు రైళ్లలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నగరాలు, పట్టణాల్లో పనిచేస్తున్న వారు కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకునేందుకు సొంతూళ్లకు వెళ్లిపోతారు. వీరిలో ఎక్కువ మంది రైలు ప్రయాణాలకు ఆసక్తి చూపుతున్నారు.   

2/5

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైళ్లలో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. దీంతో రైల్వే టికెట్ కౌంటర్ వద్ద కూడా భారీ క్యూలైన్లు ఉంటాయి.   

3/5

మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా పండుగ సీజన్‌లో ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్‌లను ముందుగా బుక్‌ చేసుకోండి. ఆన్‌లైన్ రైల్వే టిక్కెట్‌లను ఐఆర్‌సీటీసీ యాప్‌లో బుక్ చేసుకోవచ్చు.  

4/5

ఐఆర్‌సీటీసీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తరువాత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. అనంతరం మీరు ఎక్కే స్టేషన్.. వెళ్లాలనుకునే స్టేషన్ ఎంటర్ చేసి చేయండి.   

5/5

ఆ తేదీన అందుబాటులో ఉన్న రైళ్లు, టైమ్ అన్ని కనిపిస్తాయి. మీరు వెళ్లాలనుకునే రైలును ఎంచుకోండి. మీ పేరు, వయసు ఇతర వివరాలు అందజేసి.. పేమెంట్ చేయండి. ఆ తరువాత మీ టికెట్ బుక్ అవుతుంది.  





Read More