PHOTOS

IPL 2025 Mega Auction: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేసే న్యూస్.. టీమ్‌లోకి ఆ స్టార్ ప్లేయర్..!

L 2025: తొలిసారి ఐపీఎల్ టోర్నీని ముద్దాడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. జట్టులోకి స్టార్ ఆటగాళ్లు ఉం...

Advertisement
1/7

ఆర్‌సీబీకి ఈ సీజన్ వరకు దినేష్‌ కార్తీక్ వికెట్ కీపర్‌గా.. ఫినిషర్‌గా సేవలు అందించాడు. వచ్చే సీజన్‌కు దినేష్‌ కార్తీక్‌ స్థానంలో బలమైన ఆటగాడిని తీసుకోవాలని చూస్తోంది.  

2/7

త్వరలోనే మెగా వేలం జరగనుంది. స్టార్ ప్లేయర్లు వేలంలోకి రానున్నారు. దీంతో స్ట్రాంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌ను వేలంలో దక్కించుకునేందుకు లెక్కలు వేస్తున్నారు.  

3/7

దినేష్ కార్తీక్ ప్లేస్‌ను భర్తీ చేసేందుకు ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో లోకల్ బాయ్ కేఎల్ రాహుల్ ప్రముఖంగా వినిపిస్తోంది.  

4/7

లక్నో జట్టును కేఎల్ రాహుల్‌ను టీమ్ నుంచి రిలీజ్ చేస్తే.. వేలంలో ఎంత ఖర్చు చేసి అయినా దక్కించుకోవాలని ఆర్‌సీబీ చూస్తోంది.  

5/7

వికెట్ కీపింగ్‌తోపాటు రాహుల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉంది. అందుకే మొదటి ఛాయిస్‌గా కేఎల్ రాహుల్‌ను తీసుకోవాలని భావిస్తోంది.  

6/7

ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్ పేరు కూడా పరిశీలిస్తోంది. పవర్ హిట్టర్ కావడంతో వేలంలో ఆర్‌సీబీ కన్నేసే అవకాశం ఉంది.  

7/7

వికెట్ కీపర్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మను కూడా తీసుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం పంజాబ్ జట్టుకు యంగ్ కీపర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వేలంలోకి వస్తే ఆర్‌సీబీ తీసుకునే ఛాన్స్ ఉంది. 





Read More