PHOTOS

Happy Birthday Virat Kohli: రికార్డుల రారాజు.. ఛేజ్‌ మాస్టర్ కింగ్‌ కోహ్లీ బర్త్‌ డే స్పెషల్.. టాప్ రికార్డులపై ఓ లుక్కేయండి

క్రీజ్‌లోకి వస్తున్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు వణుకు.. ఎక్కడ ఫీల్డర్లను సెట్ చేయాలో తెలియక కెప్టెన్‌లో బెణుకు.. టార్గెట్ ఎంత అనేది లెక్క...

Advertisement
1/8
విరాట్ కోహ్లీ సెంచరీలు
విరాట్ కోహ్లీ సెంచరీలు

విరాట్ కోహ్లీ ఆదివారం (నవంబర్ 5) తన 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఛేజింగ్ అంటే ముందు గుర్తుకువచ్చేది కోహ్లీ పేరే. అందుకే క్రికెట్ పండితులు 'ఛేజ్‌మాస్టర్' అని పిలుస్తారు.  

2/8
విరాట్ కోహ్లీ ఫొటోలు
విరాట్ కోహ్లీ ఫొటోలు

ఇప్పటివరకు వన్డేల్లో 13,525, టెస్టుల్లో 8,676, టీ20ల్లో 4,008 రన్స్ చేశాడు కింగ్ కోహ్లీ.  

3/8
విరాట్ కోహ్లీ వార్తలు
విరాట్ కోహ్లీ వార్తలు

అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ప్లేయర్లలో 2వ స్థానంలో ఉన్నాడు . సచిన్ టెండూల్కర్ (49) కంటే కేవలం ఒక సెంచరీ దూరంలో ఉన్నాడు. నేడు కోహ్లీ బర్త్ సందర్భంగా సౌతాఫ్రికాపై సచిన్ రికార్డును సమం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.   

4/8
విరాట్ కోహ్లీ పుట్టిన రోజు
విరాట్ కోహ్లీ పుట్టిన రోజు

కోహ్లీ కెరీర్‌లో మొత్తం 78 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 49.3, వన్డేల్లో 58.05, టీ20ల్లో 52.74 సగటుతో పరుగులు చేశాడు  

5/8
విరాట్ కోహ్లీ న్యూస్
విరాట్ కోహ్లీ న్యూస్

టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యంత వేగంగా 4 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. కేవలం 65 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.   

6/8
విరాట్ కోహ్లీ రికార్డులు
విరాట్ కోహ్లీ రికార్డులు

విరాట్ కోహ్లీ శ్రీలంకపై 10 సెంచరీలు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక దేశంపై అత్యధిక స్కోర్ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.  

7/8
హ్యాపీ బర్త్ డే విరాట్ కోహ్లీ
హ్యాపీ బర్త్ డే విరాట్ కోహ్లీ

1493 రోజులు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. అర్జున, పద్మశ్రీ, ఖేల్ రత్న అవార్డులను కోహ్లీ అందుకున్నాడు.    

8/8
విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ

ప్రస్తుతం 262 మిలియన్ల మంది ఫాలోవర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న భారతీయ సెలబ్రిటీ విరాట్ కోహ్లీ. క్రిస్టియానో ​​రొనాల్డో, లియోనెల్ మెస్సీ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచంలో అత్యధిక మంది అనుసరించే క్రీడాకారుడిగా కోహ్లీ ఉన్నాడు.   





Read More