PHOTOS

Gold Rate Today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..భారీగా పెరిగిన బంగారం ధర..తులంపై ఎంత పెరిగిందంటే?

పెరిగాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా బ...

Advertisement
1/6
బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు

Gold Rate Today: పసిడి ప్రియులకు భారీ షాక్. గత కొన్నాళ్లుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు శుక్రవారం ఒక్కసారిగా భారీగా పెరిగాయి. నేడు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68వేల 250కి చేరింది. గురువారం నాడు పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67, 500 ఉండగా..ఏకంగా 1200 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 74,450కి చేరింది. నిన్న 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 73,150 ఉండగా ఏకంగా 1300రూపాయలు పెరిగింది.   

2/6
Silver prices
Silver prices

వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. గురువారంతో పోల్చితే శుక్రవారం 35 రూపాయలు పెరిగింది. గురువారం తులం వెండి ధర రూ. 915గా ఉండగా..35 రూపాయలు పెరిగి రూ. 950కి చేరుకుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 95వేలకు చేరుకుంది.   

3/6
విజయవాడలో
విజయవాడలో

విజయవాడలో ఒక గ్రాము 22 క్యారట్ల బంగారం ధర రూ. 6825 గాను, 8 గ్రాముల బంగారం ధర రూ. 54,600 గా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర రూ. 68,250 గా ఉంది. నిన్నటి ధరలతో పోల్చితే ఈ రోజు 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 1200 పెరిగింది.  

4/6
బంగారం, వెండి ధరలు మరింత పెరిగే ఛాన్స్
బంగారం, వెండి ధరలు మరింత పెరిగే ఛాన్స్

కాగా దేశీయంగా బంగారం, వెండి ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు బిజినెస్  నిపుణులు. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గడం, ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయని సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో దీని ప్రభావం వెండి, బంగారం ధరలపై పడే అవకాశం ఉంటుంది.   

5/6
ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు
ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు

ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వచ్చే వారం కీలక సమావేశం నిర్వహించనుంది. ఫెడరల్ బ్యాంక్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ఇప్పటికే రెండు సార్లు వడ్డీ రేట్లను తగ్గించారు.   

6/6
ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణం

ఇక ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరిగినా..తగ్గినా..వడ్డీ రేట్ల తగ్గింపునకు మరోసారి రెడీ అని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ సూచించారు. వచ్చే వారం వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉంది. 





Read More