PHOTOS

Gold Price In Hyderabad: నేటి మార్కెట్‌లో నిలకడగా బంగారం ధరలు, పుంజుకున్న వెండి ధరలు

ియన్ మార్కెట్ గతంలో మాదిరిగా వ్యాపారం జరగడం లేదు. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు ఢిల్లీ...

Advertisement
1/4
Gold Rate Today 05 July 2021: నేటి బంగారం, వెండి ధరలు
Gold Rate Today 05 July 2021: నేటి బంగారం, వెండి ధరలు

Gold Price Today 05 July 2021: కరోనా సెకండ్ వేవ్ తగ్గినా, బులియన్ మార్కెట్ గతంలో మాదిరిగా వ్యాపారం జరగడం లేదు. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు ఢిల్లీలో భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో వెండి ధర స్వల్పంగా పెరిగింది.

Also Read: Hyderabad Petrol Price: మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు, నేడు నిలకడగా డీజిల్ ధర

2/4
Gold Rate in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
Gold Rate in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

Gold Price In Hyderabad 05 July 2021: కరోనా కేసులు భారీగా తగ్గడంతో ఇటీవల బులియన్ మార్కెట్ మళ్లీ గాడిన పడింది. అయితే తాజాగా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,340 వద్ద మార్కెట్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,310 వద్ద స్థిరంగా ఉంది.

3/4
Gold Price Today In Delhi: దేశ రాజధానిలో బంగారం ధరలు
Gold Price Today In Delhi: దేశ రాజధానిలో బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా మార్కెట్ అవుతుండగా ఢిల్లీలోనూ అదే పరిస్థితి నెలకొంది. నేడు ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,470 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,470 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

Also Read: Samsung Galaxy F22 Price: జులై 6న విడుదలకు సిద్ధంగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22, ఫీచర్లు ఇవే

4/4
Silver Price Today in Hyderabad: నేటి వెండి ధరలు
Silver Price Today in Hyderabad: నేటి వెండి ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర భారీగా పుంజుకుంది. ఢిల్లీలో వెండి రూ.1,200 మేర భారీగా పెరగడంతో నేడు 1 కేజీ వెండి రూ.70,400కు చేరుకుంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో రూ.100 మేర స్వల్పంగా ధర పెరిగింది. నేడు హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.75,000కు చేరుకుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook





Read More