PHOTOS

Gold-Silver Rate Today : వామ్మో..మళ్లీ కొండెక్కిన పసిడి..తులం బంగారం రూ.71 వేల పై మాటే.!!

: బంగారం ధరలు ఆగస్టు 6 మంగళవారం కూడా పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. పసిడి ధర ఈరోజు కూడా భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్ర...

Advertisement
1/6
హైదరాబాద్ మార్కెట్లో ధరలు
హైదరాబాద్ మార్కెట్లో ధరలు

Gold Price in Hyderabad : అమెరికాలో ఆర్థిక మాంద్యం రాబోతుందనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ నుంచి ఉపసంహరించి బంగారం వైపు తరలిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి ఒకసారిగా డిమాండ్ పెరిగింది. ఫలితంగా దేశీయంగా కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 

2/6
24 క్యారెట్ల బంగారం
24 క్యారెట్ల బంగారం

24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాదులో 71,093 రూపాయలుగా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 65,122 రూపాయలుగా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోల్చి చూసినట్లయితే స్వల్పంగా పెరిగింది అని చెప్పవచ్చు.   

3/6
బడ్జెట్
 బడ్జెట్

బంగారం ధరలు అందరూ ఊహించినట్లుగానే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 71 వేల రూపాయలు దాటింది. అయితే సరిగ్గా గత నెల చివరి వారంలో బడ్జెట్ సందర్భంగా పసిడి ధరలు భారీగా తగ్గాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ఏకంగా ఒకేరోజు 4000 రూపాయలు తగ్గింది. కానీ అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పసిడి ధరలు మళ్ళీ రికవరీ బాట పట్టాయి.

4/6
 దిగుమతి సుంకం
 దిగుమతి సుంకం

 దిగుమతి సుంకం పై పన్ను తగ్గించినప్పటికీ బంగారం ధరలు అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వరుసగా పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి బంగారం ధర ఏకంగా 10 గ్రాములకు గాను 4వేల రూపాయలు పెరిగింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం ధర మళ్లీ చారిత్రక గరిష్ట స్థాయి అయినా 75 వేల రూపాయలను తాకడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు అని బులియన్ పండితులు విశ్లేషిస్తున్నారు.

5/6
బంగారం ధరలు
బంగారం ధరలు

బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక అమెరికా స్టాక్ మార్కెట్లో భారీగా నష్టపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీంతో పాటు ఆసియా మార్కెట్లలో కూడా భారీ పతనం నమోదు అవుతోంది. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వు ఇటీవల విడుదల చేసిన కీలక వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది.   

6/6
యూఎస్ ట్రెజరీ
 యూఎస్ ట్రెజరీ

దీంతో అమెరికా బాండ్ మార్కెట్లో యూఎస్ ట్రెజరీ బాండ్ల యీల్డ్ తగ్గింది. దీంతో చాలామంది పెట్టుబడిదారులు బాండ్ మార్కెట్ కన్నా బంగారంలోనే పెట్టుబడి పెడితే లాభదాయకమని భావిస్తున్నారు.పెట్టుబడి పరంగా చూస్తే సురక్షిత పెట్టుబడి సాధనం బంగారమే అని మదుపుదారులు అటువైపుగా తమ పెట్టుబడులన్నింటినీ తరలిస్తున్నారు.





Read More