PHOTOS

Ganesh Chaturthi 2024: శనివారం రోజు వినాయక చవితి.. ఇలా చేస్తే గణపయ్యతో పాటు, శనీశ్వరుడి అనుగ్రహాం మీ సొంతం..

నాయక చవితి పండుగను ప్రజలంతా ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 7 దేశంలో గణపయ్య చవితిని నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసార...

Advertisement
1/7
వినాయక చవితి 2024:
వినాయక చవితి 2024:

దేశమంతాట ఎక్కడ చూసిన కూడా వినాయక చవితి పండుగ సందడి కొనసాగుతుంది. మార్కెట్లన్ని పూలు, వినాయకుల విగ్రహాల అమ్మకాలతో సందడిగా మారాయి. ఎక్కడ చూసిన కూడా మార్కెట్లన్ని కలకలలాడుతున్నాయి.  

2/7
వినాయక చవితి 2024:
వినాయక చవితి 2024:

ఇదిలా ఉండగా.. ఈ సారి వినాయక చవితి పండుగ శనివారం రోజు వస్తుంది. ముఖ్యంగా శనివారం శనీశ్వరుడికి ఎంతో ప్రీతికరమైందని చెప్తుంటారు. అందుకే వినాయకుడితోపాటు, శనీశ్వరుడ్ని ఈ పూజలు చేస్తే ఆయన అనుగ్రహాం పుష్కలంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు.  

3/7
వినాయక చవితి 2024:
వినాయక చవితి 2024:

వినాయకుడ్ని పూజిస్తే మన విఘ్నాలన్ని దూరమైపోతాయి. అంతేకాకుండా..జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారని చెబుతుంటారు. అయితే.. వినాయక చవితి రోజున చాలా మంది ఉండ్రాళ్లు, మోదకాలను తయారు చేసి స్వామి వారికి నివేదిస్తారు.

4/7
వినాయక చవితి 2024:
వినాయక చవితి 2024:

వినాయకుడి పూజతో పాటు, శనీశ్వరుడ్నికూడా తలచుకుని ఆయనను పూజిస్తే ఏలినాటి శని, అర్ధష్టమ, సాడేసాతి వంటి దోషాలన్ని దూరమౌతాయి. గణపయ్యకు.. ఎరుపురంగు పూలు, ఎర్రటి వస్త్రంలతో అలంకరించాలి. 

5/7
వినాయక చవితి 2024:
వినాయక చవితి 2024:

శనీశ్వరుడికి నూనెతో అభిషేకం చేయాలి. నల్లనువ్వులు, నల్తని వస్త్రంను ఆయనకు సమర్పించాలి.  అంతేకాకుండా.. పేదకలు అన్నదానం, వస్త్రాలను దానంగా ఇస్తే  శనిప్రభావం ఉండదని కూడా పండితులు చెబుతున్నారు.  

6/7
వినాయక చవితి 2024:
వినాయక చవితి 2024:

నల్ల చీమలకు చక్కెర, బెల్లం వంటివి పెట్టాలి. రావి చెట్టు,మేడి చెట్టు కింద దీపంను పెట్టాలి. ఇలా చేస్తే..మనకు శనిప్రభావం వల్ల కలిగే దోషాలన్ని కూడా దూరమౌతాయని చెబుతుంటారు.

7/7
వినాయక చవితి 2024:
వినాయక చవితి 2024:

మనం చేసే కర్మలను బట్టి, పనుల్ని బట్టి మాత్రమే శనీశ్వరుడి దానికి తగిన ఫలితాలు ఇస్తుంటాడు. అందుకే ఎల్లప్పుడు కూడా మంచి ఆలోచనలు, మంచి పనులు మాత్రమే చేయాలని కూడా పండితులు చెబుతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)  





Read More