PHOTOS

Kalki 2898 AD hindi dubbed south movies Collections: హిందీ సౌత్ డబ్బింగ్ వెర్షన్ సినిమాల్లో ‘కల్కి 2898 AD’ ఆ ప్లేస్ అందుకుంటుందా..!

bbed south movies Collections: బాహుబలి సినిమాతో తెలుగు సినిమాలకు హిందీలో మార్కెట్ ఏర్పడింది. దీంతో తెలుగులో తెరకెక్కిన భారీ చి...

Advertisement
1/8
కల్కి 2898 AD
కల్కి 2898 AD

ప్రభాస్ హీరోగా అమితాబ్, కమల్ హాసన్ వంటి హేమాహేమీలు నటించిన ‘కల్కి 2898 AD’ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా హిందీ వెర్షన్ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

2/8
కేజీఎఫ్ 2
కేజీఎఫ్ 2

 

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ 2 మూవీ మన దేశంలో హిందీలో ఫస్ట్ డే  రూ. 53.95 కోట్ల నెట్ వసూళ్లతో సౌత్ డబ్బింగ్ హిందీ సినిమాల్లో మొదటి ప్లేస్ లో ఉంది.

3/8
బాహుబలి 2
బాహుబలి 2

బాహుబలి సినిమాతో హిందీ మార్కెట్ లో బాహుబలి 2 మూవీపై క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా అక్కడ ఫస్ట్ డే రూ. 41 కోట్ల నెట్ వసూళ్లను సాధించి సౌత్ డబ్బింగ్ సినిమాల్లో రెండో ప్లేస్ లో ఉంది.

4/8
ఆదిపురుష్
ఆదిపురుష్

 

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభు శ్రీరాముడిగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’.  ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హిందీలో తొలి రోజు రూ. 37.25 నెట్ వసూళ్లను రాబట్టి మూడో ప్లేస్ లో ఉంది.

5/8
సాహో
సాహో

 

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సాహో’. ఈ సినిమా తొలి రోజు హిందీ వెర్షన్ మన దేశంలో రూ. 24.4 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.

6/8
ఆర్ఆర్ఆర్
ఆర్ఆర్ఆర్

 

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (RRR). ఈ సినిమా హిందీలో మన దేశంలో తొలి రోజు రూ. 20.07 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.

7/8
2.O
2.O

శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘2.O’. ఈ సినిమా హిందీలో తొలి రోజు రూ. 19.74 కోట్ల నెట్ వసూళ్లతో 6వ స్థానంలో ఉంది.

8/8
సలార్ సీజ్ ఫైర్ పార్ట్ -1
సలార్ సీజ్ ఫైర్ పార్ట్ -1

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు హిందీలో షారుఖ్ ‘డంకీ’ మూవీ గట్టి పోటీ ఉన్నా.. అక్కడ తొలి రోజు రూ. 15.75 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.





Read More