PHOTOS

Sore throat: గొంతు మంటకు అధ్భుతమైన 5 చిట్కా వైద్య పద్థతులు..ట్రై చేయండి

కువగా వస్తుంటాయి. ముఖ్యంగా గొంతు మంట లేదా నొప్పి సర్వ సాధారణం. జలుబు కారణంగా గొంతు పాడవుతుంది. ఈ పరిస్థితుల్లో చిట్...

Advertisement
1/5
ఆవిరి తీసుకోవడం…
ఆవిరి తీసుకోవడం…

గొంతు నొప్పి లేదా మంట తగ్గాలంటే ఆవిరి తీసుకోవడంతో చాలా ప్రయోజనముంటుంది. ఏదైనా లోతైన గిన్నెలో వేడి వేడి నీళ్లు పోసి..అందులో లావెండర్ ఆయిల్ లేదా కైమోమాయిల్ కాస్త కలిపి..దాంతో ఆవిరి తీసుకోవాలి. లేదా పసుపు పౌడర్ కలుపుకునైనా ఆవిరి తీసుకుంటే ఉపశమనం ఉంటుంది.

2/5
వేడి నీళ్లు..ఉప్పుతో పుక్కిలించడం…
వేడి నీళ్లు..ఉప్పుతో పుక్కిలించడం…

గొంతు సమస్య నుంచి ఉపశమనం కోసం గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలుపుకుని..గొంతులో పోసుకుని పుక్కిలించుకోవాలి. దీంతో గొంతు లోపల వాపు తగ్గిపోతుంది. అంతేకాకుండా ఉప్పులో ఉండే యాంటీ సెప్టిక్ కారణంగా ఇన్ఫెక్షన్ సమస్య కూడా దూరమవుతుంది. 

3/5
నల్ల మిరియాలతో..
నల్ల మిరియాలతో..

గొంతు పాడైన సమస్యకు నల్ల మిరియాలు అద్భుతమైన పరిష్కారం. ఒక స్పూన్ తేనెలో ఒక చిన్న స్పూన్ తో నల్ల మిరియాల పౌడర్ కలపండి. రోజుకు 2-3 సార్లు తీసుకోండి. అంతేకాకుండా ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ నల్ల మిరియాల పౌడర్, కాస్త నిమ్మరసం కలిపి తీసుకుంటే గొంతు సమస్య చాలా తేలిగ్గా పోతుంది.

4/5
తేెనె-నిమ్మరసంతో..
తేెనె-నిమ్మరసంతో..

గొంతు రాకపోవడం సమస్య నుంచి విముక్తి పొందాలంటే నిమ్మరసం-తేనె కలిపి సేవిస్తే అద్భుతమైన ప్రయోజనం కలుగుతుంది. గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి..రోజుకు 2-3 సార్లు సేవించండి మీ గొంతు మెరుగైపోతుంది.

5/5
అల్లంతో ప్రయోజనాలు
అల్లంతో ప్రయోజనాలు

చలికాలంలో గొంతు సమస్యను దూరం చేయడానికి అల్లం చాలా ఉపయోగపడుతుంది. చలికాలంలో అల్లం టీ చాలా మంచిది. అల్లం టీతో మీ గొంతు బాగవుతుంది. ఇది కాకుండా అల్లంను చిన్న చిన్న ముక్కలుగా చేసి..నిమ్మరసం, కాస్త ఉప్పు చల్లి నోట్లో పెట్టుకుంటే..చాలా హాయి కలుగుతుంది. 





Read More