PHOTOS

Financial Tips To Save Money: ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా..? జీవితంలో ఈ ఐదు తప్పులు చేయకండి..!

చాలా మంది డబ్బులు ఎంత సంపాదించినా.. సేవింగ్స్ ఉండట్లేదని బాధపడుతుంటారు. అనుకోని ఖర్చులతో సేవ్ చేసుకున్న డబ్బులు కూడా అయిపోతూ ఉంటాయి. మీ...

Advertisement
1/5

మీ రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేయకపోతే ఇప్పటి నుంచి అయినా చేయండి. మీ ఉద్యోగ విరమణ చేసిన తరువాత ఆర్థిక సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆ టైమ్‌లో ఒత్తిడి లేకుండా హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేయడానికి ముందుగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. నెలవారీ స్థిర పెట్టుబడితో రిటైర్మెంట్ తరువాత మీ జీవితాన్ని హ్యాపీగా గడపవచ్చు. వీపీఎఫ్‌, ఈఎల్‌ఎస్ఎస్, పీఎఫ్‌ వంటి పన్ను ఆదా పథకాలలో  ఇన్వెస్ట్ చేయాలి.  

2/5

ఇంట్లో ఖర్చులకు కచ్చితంగా బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. దేనికి ఎంత ఖర్చు పెడుతున్నామో లెక్కలు వేసుకోవాలి. అనవసర ఖర్చులను నియంత్రించుకుని కాస్త పొదుపు చేయడం అలవాటు చేసుకోండి.   

3/5

లైఫ్‌ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ కచ్చితంగా చేయించుకోండి. అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యం పాలైతే బీమా ఎంతో ఉపయోగపడుతుంది. హాస్పిటల్ బిల్లుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.   

4/5

మీ బిల్లులను సకాలంలో చెల్లించాలని గుర్తు పెట్టుకోండి. ప్రస్తుతం క్రెడిట్ కార్డులను ఉపయోగించడం సర్వసాధారణంగా మారిపోయింది. క్రెడిట్ కార్డు పేమెంట్స్‌తో క్యాష్‌బ్యాక్‌తో సహా ఇతర ప్రయోజనాలతో పాటు వడ్డీ రహిత డబ్బును 40-50 రోజుల పాటు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే సకాలంలో బిల్లులు చెల్లించి లబ్ధిపొందండి.   

5/5

మీరు క్రమం తప్పకుండా పొదుపు చేయకపోతే కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి రావచ్చు. మీ సంపాదనలో ప్రతి నెలా 20 శాతం వరకు సేవింగ్ అమౌంట్ ఉండేలా ప్లాన్ చేసుకోండి.  





Read More