PHOTOS

Srinagar Tourist Places: శ్రీనగర్ పర్యాటక ప్రాంతాలు ఎంత అందంగా ఉన్నాయో చూశారా

Advertisement
1/5
హజ్రత్‌బల్ మస్జిద్‌లో…
హజ్రత్‌బల్ మస్జిద్‌లో…

దాల్ సరస్సు తీరాన హజ్రత్‌బల్ మస్జిద్ ( Hazratbal Mosque ) ఉంది. ఈ మసీదును తెల్లడి మార్బుల్ రాయితో నిర్మించారు. ఈ మసీదును అసర్ ఎ షరీఫ్‌గా  కూడా పిలుస్తారు. ఈ అందమైన మసీదును చూసేందుకు ...నమాజ్ చదివేందుకు దూరప్రాంతాల్నించి పర్యాటకులు పెద్దఎత్తున వస్తుంటారు. 

2/5
శంకరాచార్య ఆలయంలో..
శంకరాచార్య ఆలయంలో..

శంకరాచార్య ఆలయం ( Shankaracharya temple )..శ్రీనగర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఈ మందిరాన్ని ఎత్తైన కొండపై నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం క్రీస్తుపూర్వం 2 వందల సంవత్సరంలో అశోకుడి కుమారుడు జలుకా నిర్మించారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే ..ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడి ప్రకృతిలోని అందమైన దృశ్యాలు కూడా ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయి.

3/5
మొఘల్ గార్డెన్స్‌లో..
మొఘల్ గార్డెన్స్‌లో..

మొఘల్ గార్డెన్ ( Mughal gardens ) శ్రీనగర్ ప్రముఖ పర్యాటన ప్రాంతాల్లో ఒకటి. ఈ గార్డెన్‌ను మొఘల్స్ సమయంలో నిర్మించారు. మొఘల్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన షవర్లు పర్యాటకుల్ని తమవైపుకు ఆకర్షిస్తాయి. అందుకే శ్రీనగర్ వెళ్లినప్పుడు మొఘల్ గార్డెన్ చూడటం మర్చిపోవద్దు.

4/5
నిషాత్ తోటలో…
నిషాత్ తోటలో…

నిషాత్ తోట ( Nishat Bagh )లో ఉన్న విభిన్న రకాల అరుదైన అందమైన పూలను చూసేందుకు దేశవిదేశాల్నించి పర్యాటకులు వస్తుంటారు. నిషాత్ తోటను దాల్ సరస్సు తీరానే నిర్మించారు. ఈ తోటను అబ్దుల్ ఆసఫ్ ఖాన్..1663లో నిర్మించారు. ఈ తోటను గార్డెన్ ఆఫ్ జాయ్ అని పిలుస్తారు. శ్రీనగర్ వెళ్లినప్పుడు నిషాత్ బాగ్ చూడటం మర్చిపోవద్దు.

5/5
దాల్ సరస్సులో..
దాల్ సరస్సులో..

శ్రీనగర్ చూడ్డానికి వెళితే మాత్రం దాల్ సరస్సు ( Dal Lake ) ను తప్పకుండా చూడండి. ఇది శ్రీనగర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఈ సరస్సులో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎటు చూసినా పర్యాటకులే కన్పిస్తారు. ఇక్కడి అందాలు అందర్నీ ఆకర్షిస్తాయి. ఈ సరస్సులో హౌస్‌బోట్ ఎంజాయ్‌మెంట్ పొందవచ్చు.





Read More