PHOTOS

EPFO Salary limit: గుడ్ న్యూస్.. EPS-95 పెన్షన్ ద్వారా ప్రైవేటు ఉద్యోగులు సైతం నెలకు రూ. 10,050 పొందే అవకాశం..

d soon: ఈపీఎస్ 95 పెన్షన్ కింద నెలకు పదివేల రూపాయల పెన్షన్ రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫార్ములా ప్రకారం ...

Advertisement
1/6
EPFO జీత పరిమితి:
EPFO జీత పరిమితి:

EPFO salary limit: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్ఓ నిర్వహిస్తున్న ఈపీఎస్ 95 పెన్షన్ స్కీం ద్వారా సంస్థాగత ప్రైవేటు ఉద్యోగులకు పింఛను అందిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ పెన్షన్ కేవలం 30 లక్షల మందికి 1750 రూపాయలు మాత్రమే లభిస్తోంది. పెన్షన్ స్కీమ్‌లో ఉన్న పింఛనుదారులందరి కనీస పెన్షన్‌ను నెలకు రూ. 7,500 కు పెంచాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో EPFO ​​ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.   

2/6
దేశవ్యాప్తంగా EPS పెన్షన్ హోల్డర్లు
దేశవ్యాప్తంగా EPS పెన్షన్ హోల్డర్లు

దేశవ్యాప్తంగా EPS పెన్షన్ హోల్డర్లు ప్రస్తుతం చాలా తక్కువ పెన్షన్ పొందుతున్నారు. ప్రస్తుతం కేవలం దాదాపు  20 లక్షల మంది పెన్షన్ దారులు కేవలం రూ. 1,171 నెలవారీ పింఛను పొందుతున్నారు. తమ పెన్షన్‌ను నెలకు రూ.7,500కి పెంచాలని, డియర్‌నెస్ అలవెన్స్ సౌకర్యం కూడా కల్పించాలనేది వారి ప్రధాన డిమాండ్. దీంతో పాటు ఉచిత వైద్య సదుపాయాలు కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.   

3/6
జీతంలో 12శాతం ప్రాబిడెంట్ ఫండ్
జీతంలో 12శాతం ప్రాబిడెంట్ ఫండ్

EPS-95 ప్రకారం, ఉద్యోగుల జీతంలో 12శాతం ప్రాబిడెంట్ ఫండ్ కు వెళుతుంది. ఈ 12%లో, 8.33% EPS పెన్షన్‌కు కంట్రిబ్యూషన్‌గా వెళ్తుండగా, అదనంగా 1.16% ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌కు జమ అవుతుంది.  

4/6
EPS పెన్షన్‌ను లెక్కించడానికి ప్రత్యేక ఫార్ములా ఇదే:
EPS పెన్షన్‌ను లెక్కించడానికి ప్రత్యేక ఫార్ములా ఇదే:

EPS పెన్షన్‌ను లెక్కించడానికి ప్రత్యేక ఫార్ములా ఇదే: EPS పెన్షన్‌ను లెక్కించడానికి ప్రత్యేక విషయానికి వస్తే – సగటు జీతం x పెన్షనబుల్ సర్వీస్ / 70. ఇందులో సగటు జీతం అంటే ఉద్యోగి ప్రాథమిక జీతం + డియర్‌నెస్ అలవెన్స్ గా గుర్తించాలి. ఇది కాకుండా గరిష్ట పెన్షన్ సేవ 35 సంవత్సరాలు. ప్రస్తుత వేతన పరిమితి  రూ.15,000గా ఉంది. ఈ లెక్కన చూస్తే, ప్రస్తుతం EPS పెన్షన్ నెలకు 15,000 x 35 / 70 = రూ 7,500 వచ్చే అవకాశం ఉంది. 

5/6
వేతన పరిమితి
 వేతన పరిమితి

అయితే వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.21,000కి పెంచితే, ఉద్యోగులకు నెలకు 21,000 x 35/70 = రూ.10,050 పెన్షన్ వస్తుంది. అంటే, కొత్త నిబంధనల తర్వాత, ఉద్యోగులకు ప్రతి నెలా రూ.2550 అదనపు పెన్షన్ లభిస్తుంది.   

6/6
ఉద్యోగుల ఇన్-హ్యాండ్ జీతం కొద్దిగా తగ్గుతుంది
ఉద్యోగుల ఇన్-హ్యాండ్ జీతం కొద్దిగా తగ్గుతుంది

అయితే, ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, కొత్త నిబంధనల తర్వాత, ఉద్యోగుల ఇన్-హ్యాండ్ జీతం కొద్దిగా తగ్గుతుంది. ఎందుకంటే కొత్త నిబంధనల అమలు తర్వాత, ఉద్యోగి జీతంతో పోలిస్తే EPF, EPSలకు ఎక్కువ తగ్గింపు ఉంటుంది.  





Read More