PHOTOS

EPFO Latest News: ఉద్యోగులకు అలర్ట్.. పీఎఫ్‌ అకౌంట్స్, పెన్షన్, TDSపై బిగ్ అప్‌డేట్స్

శాలరీ నుంచి ప్రతి నెలా  12 శాతం ఈపీఎఫ్‌ అకౌంట్‌లోకి జమ అవుతుంది. అంతే మొత్తంలో ఆ ఉద్యోగి పని చేస్తున్న కంపెనీ కూడా జమ చేస్తుంది. ...

Advertisement
1/7
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ

ఈపీఎఫ్‌ఓ రీసెంట్‌గా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ట్రాన్స్‌ఫర్‌పై సోషల్ మీడియా వేదికగా లైవ్ సెషన్ నిర్వహించింది. ఈ సెషన్‌ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో 25 వేల మందికి పైగా చూశారు.  

2/7
ఈపీఎఫ్ఓ
ఈపీఎఫ్ఓ

ఈపీఎఫ్‌ అధికారులు ఈ సెషన్‌కు హాజరై కీలక విషయాలను వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.   

3/7
ఈపీఎఫ్ వడ్డీ రేటు
ఈపీఎఫ్ వడ్డీ రేటు

ముఖ్యంగా ఈపీఎఫ్‌ ట్రాన్స్‌ఫర్ ప్రాముఖ్యతను వివరించిన అధికారులు.. అన్ని ఈపీఎఫ్‌ అకౌంట్‌లను ఏకీకృతం చేయడం ద్వారా.. సభ్యులు వ్యక్తిగత అడ్వాన్స్/పాక్షిక ఉపసంహరణ సౌకర్యాన్ని పొందుతారని చెప్పారు. అంతేకాకుండా టీడీఎస్‌ను నివారించి పెన్షన్ పొందుతారని చెప్పారు.  

4/7
పీఎఫ్ బ్యాలెన్స్
పీఎఫ్ బ్యాలెన్స్

మినహాయింపు పొందిన కంపెనీల ఈపీఎఫ్‌ ట్రాన్స్‌ఫర్ గురించి కూడా వివరించారు. ఈ సెషన్ చూడలేకపోయిన వారు https://www.youtube.com/watch?v=CqBIJ6LQa8c లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు.  

5/7
పీఎఫ్‌ అకౌంట్స్
పీఎఫ్‌ అకౌంట్స్

EPFO ప్రయోజనాలు, సేవలు, ప్రక్రియల గురించి తెలుసుకోవడానికి, ఈపీఎఫ్‌ సభ్యుల సందేహాలను నివృత్తి చేయడానికి ప్రతి నెల రెండో మంగళవారం ఈ సెషన్ నిర్వహిస్తున్నారు.  

6/7
ఈపీఎఫ్ వివరాలు
ఈపీఎఫ్ వివరాలు

ఈసారి లైవ్ సెషన్ సెప్టెంబర్ 10న నిర్వహిస్తారు. ఈ సెషన్‌కు సంబంధించిన అంశం ముందుగానే సోషల్ మీడియా ద్వారా అధికారులు వెల్లడిస్తారు.  

7/7
Epf అకౌంట్స్
Epf అకౌంట్స్

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం కేవలం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే రాసినది. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక సైట్‌లను సందర్శించండి.  





Read More