PHOTOS

Bhagyashri Borse: మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే సంచలనం.. ఫస్ట్ మూవీతోనే బడా హీరోయిన్స్ కు సాధ్యం కానీ రికార్డు..

ng>: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎపుడు పాత నీరు పోయి కొత్త నీరు వస్తూనే ఉంటుంది. ఈ  కోవలో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్న మరో అందమైన భామ ‘భాగ...

Advertisement
1/8
భాగ్యశ్రీ బోర్సే స్వస్థలం
భాగ్యశ్రీ బోర్సే స్వస్థలం

భాగ్యశ్రీ బోర్సే ది మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ ఈమె స్వస్థలం. నటి కాకముందు పలు మోడల్ గా పలు కంపెనీలకు పని చేసింది.

2/8
భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ మూవీ
భాగ్య శ్రీ బోర్సే  ఫస్ట్ మూవీ

నటిగా ఫస్ట్ మూవీనే రవితేజ వంటి సీనియర్ హీరో సరసన లభించడం మాములు విషయం కాదు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

3/8
రవితేజ - ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ
రవితేజ - ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ

అంతేకాదు ఇందులో రవితేజతో భాగ్యశ్రీ బోర్సే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా హాట్ టాపిక్ గా మారింది. మాస్ మహారాజ్ కూడా ఈ సినిమాలోని పాటల్లో భాగ్యశ్రీని  టచ్ చేయకూడని అందాలను సైతం  టచ్ చేయడంపై పెద్ద దుమారమే రేగుతోంది. ముదురు హీరోకు ఈ వయసులో ఇవన్ని అవసరమా అనే కామెంట్స్ కూడా వినబడ్డాయి.

4/8
ఓన్ డబ్బింగ్
ఓన్ డబ్బింగ్

అంతేకాదు ఈ మధ్యకాలంలో ముంబై నుంచి వచ్చిన హీరోయిన్స్ కు వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పడం షరా మాములే. కానీ ఈమె పట్టుబట్టి.. తెలుగు నేర్చుకొని.. ఫస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ కోసం తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొని సంచలనం రేపింది.

5/8
భాగ్యశ్రీ ఓన్ డబ్బింగ్
భాగ్యశ్రీ ఓన్ డబ్బింగ్

బహుశా తెలుగులో విజయశాంతి సహా  ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న ఏ బడా హీరోయిన్స్ ఎవరు కూడా ఇలా ఫస్ట్ సినిమాతోనే తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పుకున్న సందర్భాలు లేవు.

6/8
రెయిడ్ మూవీ రీమేక్
రెయిడ్ మూవీ రీమేక్

మిస్టర్ బచ్చన్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా హిందీలో అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్. 1980ల కాలం నాటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

7/8
రవితేజ
 రవితేజ

స్వతహాగా అమితాబ్ అభిమాని అయిన  రవితేజ..‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో  అమితాబ్ బచ్చన్ అభిమాని పాత్రలో నటిస్తున్నాడు.  అందుకే ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టినట్టు తెలుస్తుంది.

8/8
మిస్టర్ బచ్చన్
మిస్టర్ బచ్చన్

మిస్టర్ బచ్చన్ మూవీ ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు పోటీగా రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ల ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా విడుదల కాబోతుంది.దాంతో పాటు ‘తంగలాన్’, ‘ఆయ్’  సినిమాలు పోటీలో ఉన్నాయి.





Read More