PHOTOS

Best Scuba Diving Places: బెస్ట్ స్కూబా డైవింగ్ ప్రాంతాలు ఇవే.. సముద్ర అందాలను వీక్షించండి

లైఫ్‌ రొటీన్‌గా సాగితే థ్రిల్ ఏముంటుంది. అప్పుడప్పుడు అడ్వంచర్స్ చేస్తుంటేనే మజా ఉంటుంది. స్కూబా డైవింగ్ చేయాలంటే కూడా ధైర్యం కావాలి. ఇ...

Advertisement
1/5
అండమాన్
అండమాన్

స్కూబా డైవింగ్‌కు బెస్ట్ ప్లేస్‌లో అండమాన్ ఒకటి. అద్భుతమైన పగడపు దిబ్బలు, నౌకాయానాలు, అనేక రకాల సముద్ర జీవులలకు నిలయం అండమాన్. ఇక్కడ హావ్‌లాక్ ద్వీపం, నీల్ ద్వీపంలో రూ.4 వేల నుంచి రూ.5 వేలలో స్కూబా డైవింగ్ చేయవచ్చు.

2/5
లక్షద్వీప్
లక్షద్వీప్

మీరు లక్షద్వీప్ ట్రిప్‌కు ప్లాన్ చేస్తున్నట్లయితే.. అక్కడ స్కూబా డైవింగ్‌ను మాత్రం అస్సలు మిస్సవద్దు. నీలి రంగు నీటిలో సముద్ర జీవుల మధ్య అద్భుతంగా వీక్షించవచ్చు. ప్రిన్సెస్ రాయల్, లాస్ట్ ప్యారడైజ్, డాల్ఫిన్ రీఫ్, క్లాస్‌రూమ్, ఫిష్ సూప్, మంటా పాయింట్‌లో రూ.4 వేల నుంచి రూ.7 వేలతో డైవింగ్‌ను ఆస్వాదించవచ్చు.  

3/5
గోవా
గోవా

గోవాలో నైట్‌లైఫ్‌తోపాటు సముద్రంలోపల అందాలను కూడా ఆస్వాదించవచ్చు. సుజీస్ రెక్, సెయిల్ రాక్, డేవీ జోన్స్ లాకర్, గ్రాండ్ ఐలాండ్, షెల్టర్ కోవ్, టర్బో టన్నెల్ స్కూబా డైవింగ్‌కు పెట్టింది పేరు. ఇక్కడ రూ.5 వేలతో స్కూబా డైవింగ్ చేయవచ్చు.   

4/5
నేత్రాని ద్వీపం
నేత్రాని ద్వీపం

సముద్ర తాబేళ్లు, స్టింగ్రేలు, తిమింగలం సొరచేపలను చూడాలనుకుంటే కర్ణాటకలోని నేత్రాని ద్వీపంలో స్కూబా డైవింగ్ చేయవచ్చు. ఇక్కడ రూ.5 వేలతో స్కూబా డైవింగ్ ద్వారా మంచి అనుభూతిని పొందవచ్చు.   

5/5
పాండిచ్చేరి
పాండిచ్చేరి

పాండిచ్చేరిలో స్కూబా డైవింగ్ ఏడాది పొడవునా ఉంటుంది. కూల్ షార్క్ రీఫ్, అరవింద్ కి దీవార్, టెంపుల్ రీఫ్ వంటి ప్రదేశాలలో స్కూబా డైవింగ్ ఆనందించవచ్చు. స్కూబా డైవింగ్ కోసం రూ.6-8 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.





Read More