PHOTOS

Beer Side Effects: వేసవిలో బీరు తాగే వారికి బ్యాడ్ న్యూస్.. ఈ రోగాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే!

గా చాలామంది ప్రతిరోజూ బీర్ తాగుతూ ఉంటారు. నిజానికి ఇలా తాగడం వల్ల అనేక రకాల సమస్యలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్న...

Advertisement
1/6

ముఖ్యంగా ప్రతిరోజు బీర్ తాగడం కంటే వారంలో ఒకసారి తాగితే ఎముకలు కూడా దృఢంగా మారుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని ఇటీవల పరిశోధనల్లో తేలింది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని చాలామంది ప్రతిరోజూ తాగుతున్నారు.  

2/6

ప్రతిరోజు బీర్ తాగడం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో తాగడం వల్ల మరెన్నో దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలామందిలో రాత్రిపూట దీనిని తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు కూడా వస్తున్నాయి.

3/6

అలాగే ఇప్పటికే అధిక బరువు సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు బీర్ తాగడం వల్ల మరింత బరువు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో పాటు కొంతమందిలో ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అధిక బరువు ఉన్నవారు ప్రతిరోజు తాగకపోవడం చాలా మంచిది.  

4/6

రాత్రిపూట చల్లని బీర్ తాగడం వల్ల పొట్టలోని ప్రేగుల్లో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందిలో అవి దెబ్బతిని దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే పొట్టలోని ప్రేగుల సమస్యలతో బాధపడేవారు బీరు తాగడం మానుకుంటే మంచిది.  

5/6

ముఖ్యంగా విరోచనాలు, గ్యాస్ట్రిక్ వంటి పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు బీరు తాగితే ఇవి మరింత తీవ్రతరమయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఇతర పుట్ట సమస్యలకు కూడా దారి తీయవచ్చు.

6/6

ఎక్కువగా బీర్ తాగే వారిలో శరీరంలోని ద్రవాలు ఒక్కసారిగా బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. దీని కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉంది. కాబట్టి తప్పకుండా వేసవికాలంలో అతిగా బీర్ తాగకపోవడం చాలా మంచిది.  





Read More